40.2 C
Hyderabad
April 26, 2024 14: 03 PM
Slider పశ్చిమగోదావరి

చెరువులను తలపిస్తున్న పెద్ద రోడ్లు

#mainroad
పంచాయతీ కార్యాలయం సమీపం లో

ఏలూరు జిల్లా పెదవేగి మండలం కూచింపూడి గ్రామం లో  ఆర్ అండ్ బి రహదారి  వర్షపు నీటితో నిండి  ఊర చెరువు లను తలపిస్తుంది. గాంధీ బొమ్మ సెంటర్ నుండి ర్యాంప్ సెంటర్, శుద్ధరాళ్ల మెట్ట దగ్గర రాజశేఖర్ రెడ్డి విగ్రహం సెంటర్ వరకు రహదారి పెద్ద పెద్ద  గోతులు పడి ఊరు చెరువులుగా మారింది. ఈ రహదారిలో ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

వర్షపు నీటితో చెరువులు గా నిండిన  గోతులు రహదారిలో గొయ్యక్కడుందో నుయ్యక్కడుందో తెలియ ని చందంగా ఉండటం తో వాహన దారులు ఈ రహదారిపై ప్రయాణించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత ఆర్ అండ్ బి అధికారులు  ఒక్కసారి కూచింపూడి లో పర్యటించి చెరువు గా మారిన రహదారిని స్వయంగా చూసి ప్రయాణికులు పడే అవస్థలు కళ్లారా చూసి తగిన పరిష్కారం చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఈ రహదారి పై ప్రతి ఏడాది పడే వర్షాలకు, తుపానులకు, అకాల వర్షాలకు సుమారు 4 అడుగుల వర్షపు నీరు ప్రవహిస్తుంది. ఈ పరిస్థిని కూడా గ్రామస్తులని విచారించి శాశ్వత పరిష్కారం చెయ్యాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Related posts

మహిళా సంరక్షక పోలీసులతో మమేకమైన ఎస్పీ

Sub Editor

కొల్లాపూర్ మున్సిపాలిటీ లో పెరిగిన ప్రజాసమస్యలు

Satyam NEWS

కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం కు డీకే మాదిగ సవాల్

Satyam NEWS

Leave a Comment