40.2 C
Hyderabad
May 2, 2024 16: 07 PM
Slider నిజామాబాద్

నకిలీ విత్తనాల పేరుతో రైతులు ఆగం

#spuriousseeds

విత్తన కంపనీలు రైతులతో ఆటలాడుతున్నాయి. తమ కంపనీ విత్తనాలే ఒరిజినల్ అంటూ ప్రచారం చేసుకుంటున్నాయి. దాంతో రైతులు ఆగం అవుతున్నారు. కామారెడ్డి జిల్లా బిబిపేట మండలం ఇస్సానగర్ గ్రామంలో కొందరు రైతులు ముగ్ద వరి విత్తనాలతో పంట వేసుకున్నారు. ఒక్కో కంపనీ విత్తనాల పంట రావడానికి కొంత కాలపరిమితి ఉంటుంది. కొన్ని తొందరగా, మరికొన్ని ఆలస్యంగా పంట చేతికి వస్తోంది. ఇదే అదునుగా భావించి ఇస్సానగర్ గ్రామంలో రైతులను ఒక్కసారిగా ఆందోళనకు గురిచేశారు.

గ్రామంలో కొంతమంది రైతులు ముగ్ద వరి విత్తనాలు వేశారు. ఈ పంట కాలపరిమితి 140 రోజులు. అయితే మిగతా పంట 120 రోజులకే చేతికి వచ్చింది. పక్కనే ఉన్న ముగ్ద విత్తనాల పంట చేతికి రాకపోవడంతో ఆ విత్తనాలు నకిలివి అనే రీతిలో ప్రచారం చేశారు. 10 ఎకరాలలో రైతులు నష్టపోయారు అని ప్రచారం చేశారు. అంతే ఒక్కసారిగా రైతులు ఆందోళనకు గురయ్యారు. నకిలీ విత్తనాలపై మీడియాతో మాట్లాడిన వ్యక్తి అసలు రైతే కాదని తేలింది. ఆటో నడుపుకునే వ్యక్తి, ఆ గ్రామానికి సంబంధమే లేని వ్యక్తి మాటలు రైతులు నమ్మారు.

పంటను చూపిస్తున్న రైతు

ఈ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. దాంతో వ్యవసాయ అధికారులు రంగంలోకి దిగారు. రైతులు వేసిన పంటను పరిశీలించారు. రైతులు వేసిన పంట మిగతా వాటి మాదిరిగా 120 రోజులకు కాకుండా 140 రోజులకు చేతికి వస్తుందని అధికారులు తెలిపారని రైతులు పేర్కొన్నారు. ఆదివారం కొందరు రైతులు గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. తమ పంట నష్టం కాలేదని, 140 రోజులకు పంట చేతికి వస్తుందన్న విషయం తమకు తెలియదన్నారు. విత్తన షాపుల వాళ్ల డిమాండ్ మేరకు మేము వేసిన పంటపై తమను ఆందోళనకు గురిచేసారన్నారు.

పంట ఇప్పుడే చేతికి వస్తుందన్నారు. మీడియా ప్రతినిధులను పొలం వద్దకు తీసుకెళ్లి ఇప్పుడిప్పుడే చేతికి వస్తున్న పంటను చూపించారు. అనవసరంగా గ్రామంలో ప్రచారం చేసారని రైతులు వాపోయారు. ఈ విషయమై ముగ్ద విత్తనాల కంపనీ డీలర్ శరత్ కుమార్ మాట్లాడారు.

ఇండియాలో ది బెస్ట్ కంపెనీల్లో తమది ఒకటన్నారు. ఇస్సానగర్ గ్రామంలో మాత్రమే కాకుండా చుట్టుపక్కల అనేక గ్రామాలతో పాటు ఇతర జిల్లాలలో కూడా తమ విత్తనాలతో రైతులు పంట వేసారన్నారు. ఎక్కడ కూడా ఇలాంటి సమస్య రాలేదన్నారు. కేవలం ఇక్కడే కావాలని ఈ ప్రచారం చేశారన్నారు. తమ విత్తనాలు 125 రోజుల నుంచి 140 రోజుల్లో పంట చేతికి వస్తుందని తెలిపారు. వ్యవసాయ అధికారులు వచ్చి పంటలను పరిశీలించారని, ఈ పంట 140 రోజులకు వస్తుందని అధికారులు రైతులకు వివరించారని పేర్కొన్నారు. దుష్ప్రచారాలను నమ్మవద్దని కోరారు.

కంపనీ డీలర్ శరత్ కుమార్

Related posts

మెడలు వంచుతానన్న జగన్ ఇప్పడు మెడ ఎత్తడం లేదు

Bhavani

అనారోగ్యంతో కన్నుమూసిన సి ఐ టి యు నాయకుడు

Satyam NEWS

కామారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ

Satyam NEWS

Leave a Comment