38.2 C
Hyderabad
May 2, 2024 19: 54 PM
Slider ఖమ్మం

జలాశయాల వద్దకు ఎవరూ రాకుండా చర్యలు

#Collector Dr. Priyanka Ala

కాజ్ వేలు, జలాశయాలు వీక్షణకు ప్రజలు రాకుండా నియంత్రణ చేసేందుకు పటిష్ట భద్రత ఉండాలని జిల్లా కలెక్టర్ డా ప్రియాంక అల అధికారులను ఆదేశించారు.కాజ్ వేలు, జలాశయాల వద్ద పటిష్ట భద్రత, ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలింపు, రోడ్లపై నీరు చేరిన ప్రాంతాల్లో రవాణా నియంత్రణకు భారీకేడింగ్ ఏర్పాట్లు తదితర అంశాలపై రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్, సెక్టోరియల్, మండల ప్రత్యేక అధికారులు, పంచాయతీరాజ్ అధికారులతో టెలికాన్ఫెరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శిధిలావస్థలో ఉన్న గృహాల నుండి ప్రజలను తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పారు. శిధిలావస్థలో ఉన్న ఇళ్ళు కూలే ప్రమాదం ఉన్నందున తొలగింపుకు నోటీస్ లు జారీ చేయాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.

గోదావరికి ఎగువ నుండి వరద వచ్చే అవకాశం ఉన్నందున గ్రామ స్థాయి నుండి ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పారు. చెరువులు నిండుకున్నాయని పరిరక్షణ చర్యలు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.


వరద వచ్చిన తదుపరి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడం ఇబ్బంది అవుతుందని, అంత వరకు వేచి ఉండకుండా ముందస్తుగానే ముంపు గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని చెప్పారు.అంతకు ముందు పాల్వంచ మాండలం నారాగం వద్ద కిన్నెరసాని వంతెన. పరిశీలించారు. అక్కడి నుండి భద్రాచలం వస్తూ మార్గ మద్యలోనే టెలి కాన్ఫరెన్సు నుర్వహించారు.

ఈ టెలి కాన్ఫరెన్స్ లో ఐటిడిఏ పిఓ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, మధుసూదన్ రాజు, డిపిఓ రమాకాంత్, జడ్పి సీఈఓ విద్యాలత అన్ని మండలాల తహశీల్దార్లు, ఎంపీడీఓ లు తదితరులు పాల్గొన్నారు.

Related posts

భారతీయ టిఫిన్ ను తక్కువ అంచనా వేయద్దు ఆనంద్ మహీంద్రా

Sub Editor

శివసేన ఎంఎల్ఏలలో చీలిక తెస్తున్న బిజెపి

Satyam NEWS

వనపర్తిలో గుడి కూల్చివేత వద్దు

Bhavani

Leave a Comment