30.7 C
Hyderabad
April 29, 2024 03: 39 AM
Slider జాతీయం

భారతీయ టిఫిన్ ను తక్కువ అంచనా వేయద్దు ఆనంద్ మహీంద్రా

మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎంత బిజీగా ఉన్నా.. ఆయన తన ఆలోచనలను ఎప్పుడూ ప్రజలతో పంచుకుంటారు. ఆయన ఫాలోవర్లు కూడా కామెంట్లతో తెగ వైరల్ చేస్తుంటారు. తాజాగా ఆనంద్ మహేంద్ర కెల్లాగ్ ఉప్మా గురించి ఓ పాత కథనాన్ని పంచుకున్నారు.

అమెరికన్ కంపెనీ కెల్లోగ్ భారతదేశానికి వచ్చినప్పుడు భారతీయుల అల్పాహార అలవాట్లను మార్చాలని సవాలు చేశారట. అయితే, ఇండియన్స్‌ అల్పాహార అలవాట్లు మారలేదు కానీ, కెల్లాగ్స్ తన ఆహార ఉత్పత్తిని మార్చాల్సి వచ్చింది. ఈ మీమ్‌ను ఆనంద్‌ మహీంద్రా తన ట్విట్టర్‌లో షేర్ చేస్తూ ‘కెల్లోగ్స్ భారతదేశానికి వచ్చారు. భారతీయుల అల్పాహారం, అలవాట్లను పూర్తిగా మార్చుతామంటూ సవాలు చేశారు. కానీ, 10 సంవత్సరాల్లో కెల్లోగ్సే మారిపోయింది”అంటూ రాసుకొచ్చారు.

ఇప్పడు ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వందల సంఖ్యలో రీ ట్వీట్‌లు చేస్తున్నారు. 12 వేలకు పైగా లైక్స్‌ వచ్చాయి. మా ఆహార అలవాట్లను ఎవరూ మార్చలేరంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. మా అల్పాహారాలకు మరేవీ సాటిరావంటున్నారు.

Related posts

ఎంఎల్ఏ మేడా వర్గీయులు వైసిపి నుంచి టిడిపి లోకి జంప్

Satyam NEWS

శంషాబాద్ to రాజోలు బస్సులో కారం చల్లి దోపిడీ ప్రయత్నం..

Satyam NEWS

‘ఆత్మీయత’ ఖమ్మం నుంచే మొదలు

Murali Krishna

Leave a Comment