26.7 C
Hyderabad
May 3, 2024 07: 27 AM
Slider కడప

ప్రాధాన్యత సంతరించుకున్న సి.ఎం తో మేడా సోదరుల కలయిక…..

#Meda Mallikarjun reddy

కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లి ఖార్జున రెడ్డి కుమారుడు మేడా కృష్ణతేజా రెడ్డి,సోదరులు యం. ఆర్.కె.ఆర్ అధినేత మేడా రఘునాధ్ రెడ్డి, మేడా రాజశేఖర్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ని తాడేపల్లి లోని ఆయన నివాసంలో మంగళ వారం కలవడం ప్రత్యేకతని సంతరించుకుంది. జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలల్లో ఆర్థికంగా బలమైన నేతగా ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి పేరు పొందారు. మేడా మల్లిఖార్జున రెడ్డి సోదరుడు మేడా రఘునాథరెడ్డి మృదు స్వాభావిగా మంచి వ్యాపార వేత్తగా పేరు ఉంది.

తమ్ముడు మేడా మల్లిఖార్జున రెడ్డి రాజకీయ ఎదుగుదలకు రఘునాథరెడ్డి పాత్ర కీలకం. జిల్లా కేంద్రంలోని కడప లోయం.ఆర్.కె.ఆర్ ట్రస్ట్ ద్వారా కోవిడ్ సెంకండ్ వేవ్ సమయంలో మేడా కన్వెన్షన్ సెంటర్ లో ఉచితంగా కోవిడ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి 100 పడకల ఆక్సిజన్ ను ఏర్పాటు చేసి రోగులకు సేవలందించారు. ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి తన రాజంపేట నియోజక వర్గంలో కోవిడ్ తో మృతి చెందిన కుటుంబాలకు అంత్యక్రియల ఖర్చు నిమిత్తము10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు.

కాగా ఎన్నికల్లో మేడా కుటుంబీకులు జిల్లాలోని వైసీపీ అభ్యర్థులకు అధిష్టానం సూచన మేరకు ఆర్థిక సహాయం చేసినట్టు తెలుస్తోంది.మేడా కుటుంబీకు లు వారి వర్గీయులు మంత్రి పదవిని ఆశించారు. అయితే తొలివిడత లో ఆయనకు మంత్రి పదవి కాకుండా గత తెలుగుదేశం హయాంలో వారి తండ్రి మేడా రామకృష్ణరెడ్డి కి లభించిన టీటీడీ బోర్డు మెంబర్ పదవీ ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జున రెడ్డి కి లభించడంతో ఆయన వర్గీయులు డీలా పడ్డారు. అదే విధంగా మేడా రఘునాథరెడ్డి కి ఎమ్మెల్సీ పదవీ ఇస్తారని గతంలో ముమ్మర ప్రచారం జరుగగా అది కూడా ప్రచారానికే పరిమితం అయ్యింది.

ఈ నేపధ్యంలో రాష్ర్ట ముఖ్యమంత్రి మంత్రి వర్గం కాల వ్యవధి ముగియ నుండడం కొత్త వారికి అవకాశం కల్పించనున్నట్టు ఇందుకు సంబంధించిన కసరత్తు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ని ఎమ్మెల్యే మేడా సోదరులు కలిసినట్టు ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే మేడా మల్లిఖారున రెడ్డి కి మంత్రి వర్గంలో చోటుతో పాటు సోదరుడు మేడా రఘునాథరెడ్డి కి టీటీడీ బోర్డు మెంబర్ పదవీ లభించే అవకాశం ఉన్నట్టు ఆయన వర్గీయులు భావిస్తున్నారు.

ముఖ్యమంత్రి ని కలిసిన వారిలో ఎమ్మెల్యే మేడా మల్లిఖార్జునరెడ్డి తో పాటూ ఆయన కుమారుడు కృష్ణతేజా రెడ్డి ఉన్నారు. ఇటీవల కృష్ణతేజారెడ్డి పేరిట మేడా వర్గీయులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం,సేవాకార్యక్రమాల్లో పాలు పంచుకోవడం చురుగ్గా చేస్తున్నారు. ఈ నేపధ్యంలో జగన్మోహన్ రెడ్డి కి కృష్ణతేజా రెడ్డి ముఖ్యమంత్రి కి పుష్ప గుంచం అందించారు.ఇది కూడా భవిష్యత్ రాజకీయ ప్రయోజనాల కోసమే భావిస్తున్నారు.ఏది ఏమైనా మేడా వర్గీయుల ఆశలు మంత్రివర్గ ప్రకటన తరువాత నిజమౌ తాయని భావిస్తాం….

Related posts

టీవీ9 రవిప్రకాష్ పై మరో కొత్త కేసు నమోదు

Satyam NEWS

రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

Satyam NEWS

గ్రీవెన్స్ డే దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి

Bhavani

Leave a Comment