38.2 C
Hyderabad
April 29, 2024 11: 31 AM
Slider ప్రత్యేకం

బిల్లుల చెల్లింపు: హైకోర్టుకు ఉన్నతాధికారుల సంజాయిషీ

#APHighCourt

ఉపాధి హామీ పనులకు బిల్లుల చెల్లింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు నేడు హైకోర్టు ఎదుట సంజాయిషీ ఇచ్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జాతీయ ఉపాధి హామీ పధకంలో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులు చెల్లింపు విషయంలో ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చినట్లయింది.

గతంలో హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయటంతో, ఈ రోజు చీఫ్ జస్టిస్ ముందు జరిగిన విచారణకు, రాష్ట్ర ఉన్నతాధికారులు హాజరు అయ్యారు. పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, ఫైనాన్సు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ఎస్ రావత్ ఈ రోజు ధర్మాసనం ముందుకు హాజరు అయి వివరణ ఇచ్చుకున్నారు.

ఇప్పటికే ఐదు లక్షల రూపాయల లోపు బిల్లుకు మొత్తం 400 కోట్లు రూపాయలు చెల్లించామని, మరో 1100 కోట్ల రూపాయలు ఏడు రోజుల్లో చెల్లిస్తామని ధర్మాసనం ముందు రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇంకా రావాల్సి ఉంది అంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు చెప్పగా, కేంద్ర ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇవ్వాల్సిన నిధులు అన్నీ ఇచ్చేశామని ఆయన తెలిపారు.

ప్రభుత్వం 400 కోట్లను పంచాయతీల ఎకౌంటులో వేసాం అంటూ చెప్పటం పై, పిటీషనర్ తరుపు న్యాయవాదులు వీరారెడ్డి, దమ్మాలపాటి శ్రీనివాస్, నర్రా శ్రీనివాస్ అభ్యంతరం తెలిపారు. ఈ పనులు ఎవరు అయితే చేశారో, వారి ఎకౌంటు లో మాత్రమే డబ్బులు వేయాలని కోర్టుకు తెలిపారు.

కాంట్రాక్టర్లను వేధిస్తున్నారు అంటూ కోర్టుకు తెలిపారు. దీని పై ధర్మాసనం  తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పంచాయతీ ఎకౌంటులో మీరు నిధులు వేస్తే, అవి లబ్దిదారులకు ఎలా వెళ్తాయి అంటూ అధికారులను ప్రశ్నించింది. వెంటనే ఈ నిధులను ఎవరు అయితే పనులు చేసారో, వారికి నేరుగా చెల్లించాలని, ఈ చెల్లింపులకు సంబంధించి, పూర్తి వివరాలు కూడా వచ్చే వాయిదా నాటికి తమకు ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

పూర్తి స్థాయి అఫిడవిట్ తమకు ఇవ్వాలని, కోర్టు ఆదేశించింది. ఇక ఉన్నతాధికారులు అయిన పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, ఫైనాన్సు ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ఎస్ రావత్ తాము గత రెండు వాయిదాల నుంచి కోర్టుకు వస్తున్నాం అని, వచ్చే వాయిదాకు తమకు మినహాయింపులు ఇవ్వాలని కోరగా, దానికి హైకోర్టు ఒప్పుకోలేదు. ఈ కేసు విచారణ అయ్యేంత వరకు అధికారులు కోర్టుకు రావాల్సిందే అంటూ హైకోర్టు తేల్చి చెప్పింది.

Related posts

ఐఏఎస్ అధికారులపై అభిశంసన తిప్పిపంపిన జగన్ సర్కార్

Satyam NEWS

శబరిమలలో దర్శనం ఇచ్చిన మకరజ్యోతి

Satyam NEWS

న‌యీం కేసుపై గ‌వ‌ర్న‌ర్‌కు ఫోరంఫ‌ర్ గుడ్ గ‌వ‌ర్నెన్స్ లేఖ‌!!!

Sub Editor

Leave a Comment