37.2 C
Hyderabad
May 2, 2024 11: 05 AM
Slider ప్రత్యేకం

నీతి, నిజాయితీ, సేవా స్ఫూర్తితో ప్రజలకు సేవలందించాలి

#police

నీతి, నిజాయితీ, నిబద్ధతతో ప్రజలకు జవాబుదారీగా పోలీసు విధులు నిర్వర్తించాలని విశాఖ రేంజ్ డీఐజీ ఎల్.కే.వి.రంగారావు అన్నారు. విజయనగరం జిల్లాలో పని చేస్తున్న పోలీసు అధికారులకు విశాఖ రేంజ్ డీఐజీ  రంగారావు ‘పరివర్తన’ కార్యక్రమాన్ని విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించారు.

ఈ సందర్భంగా విశాఖ రేంజ్ డీఐజీ మాట్లాడుతూ నీతి, నిజాయితీ, అంకితభావంతో ప్రజలకు సేవలందించాలన్నారు. సేవా దృక్పథంతో ప్రజలకు సేవలందించాలని, పోలీసు స్టేషనుకువచ్చే ఫిర్యాదుదారులు, బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలని, వారు చెప్పిన బాధలను శ్రద్ధతో విని, పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. వృద్ధులు, మహిళల పట్ల సానుకూలంగా మాట్లాడి, వారి ఇబ్బందులను తెలుసుకొని తక్షణ పరిష్కారం చూపేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రజలకు ప్రత్యక్షంగా సేవ చేసే అవకాశం పోలీసు ఉద్యోగులకు మాత్రమే లభిస్తుందని, అటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేుకొని పోలీసు వ్యవస్థ ప్రతిష్టను మరింత పెంచే విధంగా పని చేయాలన్నారు. ధర్మబద్ధంగా పని చేసి, మంచి పోలీసు అధికారిగా గుర్తింపు తెచ్చు కోవాలన్నారు. అంకిత భావంతో ప్రజలకు సేవ చేయాలన్నారు. అనంతరం పోలీసు అధికారులతో డీఐజీ అంకిత భావంతో, నీతి నిజాయితీతో, నిష్పక్షపాతంగా, నిస్వార్ధంగా, రాగద్వేషాలకు అతీతంగా విధులు నిర్వహిస్తామని ‘ప్రతిజ్ఞ’ చేయించారు.

ఈ కార్యక్రమంలో  అదనపు ఎస్పీ పి. సత్యన్నారాయణరావు, ఒఎస్టీ ఎన్.సూర్యచంద్రరావు, విజయనగరం డీఎస్పీ పి.అనిల్ కుమార్, బొబ్బిలి డీఎస్పీ బి.మోహనరావు, పార్వతీపురం డీఎస్పీ ఎ.సుభాష్, ట్రాఫిక్ డీఎస్పీ ఎల్.మోహనరావు, ఎస్సీ మరియు ఎస్టీ సెల్ డిఎస్పీ ఆర్. శ్రీనివాసరావు, దిశా డీఎస్పీ టి.త్రినాధ్, ఎఆర్ డీఎస్పీ ఎల్. శేషాద్రి, సిఐలు బి.వెంకటరావు, జి. రాంబాబు, రుద్రశేఖర్, జె.మురళి, సిహెచ్. లక్ష్మణ రావు, టిఎస్ మంగవేణి, శ్రీధర్, ఎస్.సింహాద్రినాయుడు, బాల సూర్యారావు, డి.రమేష్, జి.సంజీవరావు, శోభన్ బాబు, విజయానంద్, ఈ.నర్సింహమూర్తి, ఎల్.అప్పలనాయుడు, టి.వి. తిరుపతిరావు, సి. హెచ్. శ్రీనివాసరావు, ఆర్ఐలు చిరంజీవి, ఈశ్వరరావు, రమణ, మరియన్ రాజు వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న ఎస్ఐలు, ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం

Related posts

జగన్ సర్కార్ పై నిమ్మగడ్డ కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు

Satyam NEWS

అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్

Satyam NEWS

హౌసింగ్ ప్రోగ్రాం కు రెవెన్యూ పూర్తి సహకారం కావాలి

Satyam NEWS

Leave a Comment