38.2 C
Hyderabad
April 29, 2024 13: 54 PM
Slider తెలంగాణ

స్పెషల్: మేడారం జాతరకు ప్రత్యేక టూర్ బస్

srinivasagowd

శ్రీ సమ్మక్క సారాలమ్మ మహాజాతర సందర్భంగా మేడారం కు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టూర్ బస్ ను రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. హైదరాబాద్ లో మంత్రుల నివాస సముదాయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్  భూపతి రెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్, టూరిజం అధికారులు అంజిరెడ్డి, నేత్ర, రాజలింగం, వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యాటక రంగం పై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేస్తున్నారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ లో ఉన్న చారిత్రక, పురావస్తు సంపద ను నిర్లక్ష్యం చేసి టూరిజం అంటే బీచ్ లను చూపించారని ఇప్పుడు పరిస్థితి మారిందని అన్నారు.

తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే కాళేశ్వరం టూర్ ప్యాకేజీ కి విశేష స్పందన లభించిందన్నారు. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న సోమశిల నుండి శ్రీశైలం వరకు క్రూజ్ టూర్ కు పర్యాటకుల నుండి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. గిరిజనుల ఆరాధ్య దైవం మేడారం సమ్మక్క సారాలమ్మ ల మహాజాతర కు హైదరాబాద్ నుండి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో బస్సు సౌకర్యం కల్పిస్తున్నామన్నారు.

మేడారం జాతర ప్రత్యేక ప్యాకేజీ యాత్ర హైదరాబాద్-మేడారం- హైదరాబాద్ ఒక్కరోజు ప్యాకేజీ టూర్ కు వోల్వో కోచ్ కు 1500 పెద్దలకు, 1200 పిల్లలకు, నాన్ ఏసీ హైటెక్ కోచ్ కు రూ.1000 పెద్దలకు, రూ.800 పిల్లలకు టారిఫ్ ను నిర్ణయించామన్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగుల కోసం మేడారం కు ప్రత్యేక టూర్ లో భాగంగా హెలికాప్టర్ సర్వీస్ ను ప్రారంభించడానికి పరిశ్రమల, IT శాఖ ల మంత్రి KT రామారావు తో చర్చించి త్వరలోనే ప్రారంభిస్తామన్నారు.

Related posts

6న వైకుంఠ ఏకాద‌శి, 7న వైకుంఠ ద్వాద‌శికి ఏర్పాట్లు పూర్తి

Satyam NEWS

[Official] How To Higher Cholesterol Ace Inhibitor Blood Pressure Pills Amazon Prime Blood Pressure Supplements

Bhavani

మరువ లేని మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి: ఆదెర్ల శ్రీనివాస రెడ్డి

Satyam NEWS

Leave a Comment