29.7 C
Hyderabad
May 6, 2024 06: 07 AM
Slider సినిమా

కారణజన్ముడు మెగాస్టార్ చిరంజీవి: ఘనంగా జన్మదినోత్సవం

#megastar

తన అభిమానులను సినిమాలకే పరిమితం కాకుండా సేవామార్గంలో  నడిపించి,సమాజానికి ఆదర్శంగా మెగాభిమానులను స్ఫూర్తిదాయకంగా నిలబెట్టిన ఘనత మెగాస్టార్ చిరంజీవి కే దక్కుతుందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి అన్నారు.

ప్రముఖ సినీనటులు కేంద్ర మాజీ మంత్రి,  పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విజయనగరం జిల్లా చిరంజీవి యువత ఆధ్వర్యంలో స్థానిక కలక్టరేట్ కూడలిలో ఉన్న ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నూతన బ్లడ్ బ్యాంక్ లో చిరంజీవి పుట్టినరోజు వేడుకల్ని నిర్వహించారు.

ఈ వేడుకల్లో భాగంగా ఉత్తరాంధ్ర ఇలవేల్పు శ్రీ పైడి తల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, సర్వమత ప్రార్ధనలు చేశారు. ఈ సర్వమత ప్రార్ధనల్లో మరో అతిథిగా జనసేన పార్టీ సీనియర్ నేతలు ఆదాడ మోహనరావు పాల్గొన్నారు.అనంతరం కాలిఘట్ కాలనీలో మొక్కలు నాటారు.

అనంతరం నగరంలో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ లో జరిగిన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి కేక్ కట్ చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం జిల్లా చిరంజీవి యువత నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు.

ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి సమాజంలో మెగాభిమానులను స్ఫూర్తిదాయకంగా నిలిపారన్నారు. తాను ఎంచుకున్న సేవామార్గమైన రక్తదానం, నేత్రదానం ఉద్యమాల్లోనే  కాకుండా ఈ విపత్కర పరిస్థితుల్లో ఆక్సిజన్ బ్యాంక్ ను స్థాపించారన్నారు.తన అభిమానులతోనే నడిపించి,ఓ ఆపద్బాంధవుడిగా ప్రాణదాత అయ్యి ప్రపంచానికే చిరంజీవి మార్గదర్శి,స్ఫూర్తిప్రధాతగా నిలిచారనడంలో అతిశయోక్తి కాదన్నారు.చిరంజీవి లెక్కలేనన్ని ఆపదలో ఆదుకునే సేవలతోపాటు ఇప్పుడు సినీపరిశ్రమకు పెద్దదక్కుగా ఈ విపత్కర పరిస్థితుల్లో సినీకార్మికులను ఆదుకుని దేవుడయ్యారని అందుకే చిరంజీవి కారణజన్ముడు అని ఆమె అభివర్ణించారు.

జిల్లా చిరంజీవి యువత అధ్యక్షుడు, జనసేన పార్టీ సీనియర్ నేత త్యాడ రామకృష్ణారావు(బాలు) మాట్లాడుతూ అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు పిలుపుతో ఆగష్టు 9వ తేదీ నుంచి 22వరకు రోజుకు 9 మొక్కలు చెప్పున ప్రతీరోజూ మొక్కలు నాటామని, చివరిరోజైన 22న పహ సర్వమత ప్రార్థనలు, రక్తదాన శిబిరాన్ని నిర్వహించామన్నారు. అనంతరం పలువురు నిరాశ్రయులకు ఆహారపొట్లాలు  పంచిపెట్టామని అన్నారు. చిరంజీవి ఆశయాలతో ప్రజలకు సేవచేస్తూ ముందుకెళ్తామన్నారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఝాన్సీ వీరమహిళల, జనసేన చేనేత కార్మిక రాష్ట్ర కార్యదర్శి కాటం అశ్వని,జనసేన పార్టీ నాయకులు దంతులూరి రామచంద్రరాజు,వంక నరసింగరావు,రవితేజ, ప్రసాద్, జిల్లా చిరంజీవి యువత సభ్యులు కొయ్యాన లక్ష్మణ్ యాదవ్,లోపింటి కళ్యాణ్, చెల్లూరి ముత్యాల నాయుడు,బూర్లీ వాసు,పిడుగు సతీష్,ఏంటి రాజేష్,నిడిగొట్టి శ్రీను, బెలగాన చందు,పావాడ ప్రసాద్,ఉనుకూరి వాసు, అలబొయిన శివగణేష్ కృష్ణ, సీర కుమార్,జడ్డు జనా, లెంక నాగార్జున,పిన్నింటి తరుణ్,సాయి,శ్రీను, సతీష్,ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

రోగనిరోధక శక్తిని చంపేస్తున్న ఆర్ఎంపి డాక్టర్లు

Satyam NEWS

ఉజ్వల ప్రస్థానం, బంగారు బాట ఆవిష్కరణ

Satyam NEWS

వైసీపీ పై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు ధ్వజం

Bhavani

Leave a Comment