29.7 C
Hyderabad
May 3, 2024 05: 31 AM
Slider వరంగల్

రోగనిరోధక శక్తిని చంపేస్తున్న ఆర్ఎంపి డాక్టర్లు

#mulugudmandho

క్లీనిక్ యాక్ట్ ను  ఉల్లంఘించి ప్రజలకు ఎక్కువ మోతాదు కలిగిన పవర్ ఫుల్ యాంటీబయాటిక్స్(Meropenem, Pipenacillin, Certriaxine injections) ఇస్తున్న ఆర్ఎంపి క్లినిక్ లను ములుగు జిల్లా వైద్యాధికారులు తనిఖీలు చేశారు. ప్రథమ చికిత్స కే పరిమితం కావాల్సిన ఆర్ఎంపీలు ఇష్టమొచ్చినట్లు ప్రజల ఆరోగ్యాలతో  చెలగాటమాడుతున్నారని ములుగు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ అప్పయ్య తెలిపారు.

నూగూరు వెంకటాపూర్ లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఉప జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎం వెంకటేశ్వర్లు కూడా ఈ తనిఖీలలో పాల్గొన్నారు. అక్కడి సాయి క్లినిక్ కి వెళ్లి తనిఖీ నిర్వహించగా పలు అంశాలు వెల్లడి అయ్యాయి.

ఆర్.ఎం.పి డాక్టర్ జయసింహ నడుపుతున్న సాయి క్లినిక్ వెళ్లి ప్రజలతో మాట్లాడి  సమాచారాన్ని తీసుకోవడంతోపాటు, రికార్డులను పరిశీలించారు. అక్కడ వాడుతున్న  మందులను పరిశీలించారు. అనంతరం పక్కనే ఉన్న మెడికల్ షాప్ ని సందర్శించి అక్కడ విక్రయిస్తున్నా మందులను పరిశీలించారు.

RMP యాక్ట్ ప్రకారం క్లినిక్ ఎటువంటి రిజిస్ట్రేషన్ కాలేదని విచారణలో వెల్లడి అయింది. అర్హత కలిగిన రిజిస్టర్ ఫార్మసిస్ట్ మందులు అమ్మాల్సి  ఉండగా గణపతి మెడికల్ స్టోర్ లో అర్హతలేని ఫార్మసిస్ట్ మందులు ఇస్తున్నారు. అనంతరం డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ బృందం వెంకటాపూర్ లోని పోలీస్ స్టేషన్ లో సిఐ కి సమాచారం ఇచ్చారు.

సిఐ వెంటనే  క్లినిక్ సందర్శించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. క్లినిక్ వచ్చిన వారి నుండి 100 రూపాలు కన్సల్టెంట్  ఫీజుగా  వసూలు చేస్తున్నారు. ఐదు పడకల కలిగిన క్లినిక్ లు నడిపిస్తున్నారు. ఎక్కువ యాంటీబయాటిక్స్ ఇవ్వడం వల్ల రోగులలో డ్రగ్ రెసిస్టెన్స్ రావడం, వ్యాధులు తిరగబెట్టడం జరుగుతుంది.

తర్వాత వేసుకునే మందులు పనిచేయకపోవడం,  వ్యాధినిరోధక శక్తి తగ్గిపోయి వ్యాధులు నియంత్రించే శక్తి కోల్పోవడం జరుగుతుంది అని తెలిపారు. ఏటూరునాగారం ఐటీడీఏ Dy. DMHO డాక్టర్ వెంకటేశ్వర్లు, నంబికిషోర్, డాక్టర్ రాజమౌళి ఆరోగ్య సిబ్బంది ఈ తనిఖీలలో పాల్గొన్నారు.

Related posts

ఏ.స్ రావు నగర్ మలబార్ గోల్డ్ & డైమండ్స్  షోరూంలో “బ్రైడల్ జ్యువెలరీ షో

Satyam NEWS

కేసీఆర్ మోస‌కారి అంద‌రినీ మ‌భ్య‌పెట్టారు బీజేపీ

Sub Editor

ఇప్పటికే ఉన్న నాయకులకు ఊడిగం చేయాల్సిందే

Satyam NEWS

Leave a Comment