23.7 C
Hyderabad
May 8, 2024 06: 14 AM
Slider ప్రత్యేకం

ఏపిలో ప్రమాదకరమైన మద్యం అమ్మకాలపై దృష్టి సారించిన కేంద్రం

#raghurama

ఆంధ్రప్రదేశ్ లో అమ్ముతున్న చీప్ లిక్కర్ బ్రాండ్లను పరిశీలించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు రాసిన లేఖపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ స్పందించారు. తక్షణమే ఈ విషయాన్ని పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో వివిధ పేర్లతో ప్రజలకు హాని కలిగించే మద్యం బ్రాండ్లు విచ్చలవిడిగా అమ్ముతున్నారని రఘురామ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నేరుగా అమ్ముతున్న ఈ చీప్ లిక్కర్ ప్రజల ఆరోగ్యం పై పెను ప్రభావం చూపిస్తున్నదని ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ఏవో తెలియని కొత్త పేర్లతో అమ్ముతున్న మద్యం ఆమోదిత ప్రమాణాలలో ఉందో లేదో తెలియని పరిస్థితి ఉందని ఆయన అన్నారు.

రాష్ట్రంలో అమాయకులైన రోజు వారీ కార్మికులు, కర్షకులు ఇలాంటి చీప్ మద్యం ప్రతి రోజూ తాగుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వారి ఆరోగ్యంపై పెను ప్రభావం చూపించే అవకాశం ఉన్నందున ఈ కొత్త రకం మద్యం బ్రాండ్లపై తగిన పరిశీలన జరపాల్సిన అవసరం ఉందని రఘురామ తన లేఖలో పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లభ్యం కాని బ్రాండ్లను అత్యంత ఎక్కువ ధరకు ఆంధ్రప్రదేశ్ లో అమ్ముతున్నారని ఆయన అన్నారు.

నాణ్యత ఏ మాత్రం లేని ఈ మద్యం తాగడం వల్ల ఎంతో మంది అనారోగ్యం బారిన పడేందుకు అవకాశం ఉందని, అదే జరిగితే లక్షలాది కుటుంబాలు అన్యాయమైపోతాయని రఘురామ తెలిపారు. రఘురామ లేఖపై తక్షణమే స్పందించిన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Related posts

ప్రేమ పెళ్లికి ఇంట్లో ఒప్పుకోలేదని స్టూడెంట్స్ ఆత్మహత్య

Bhavani

వంటరి మహిళను వేధించి యాసిడ్ దాడి

Satyam NEWS

ఉద్యమ పితామహుడు పూలే

Sub Editor

Leave a Comment