40.2 C
Hyderabad
April 29, 2024 15: 55 PM
Slider ఖమ్మం

కరోనా సేవలు అందించిన ఖమ్మం పోలీస్ సిబ్బందికి మెమెంటోలు

#KhammamPolice

కరోనా గడగడలాడిస్తున్న సమయంలో లాక్  డౌన్  కాలంలో ఖమ్మం ట్రాఫిక్ , ఖానాపురం  హవేలి  పరిధిలో  అత్యుత్తమ సేవలు అందించిన పోలీస్ సిబ్బందిని ఖమ్మం జిల్లా ఎన్నారై ఫౌండేషన్ వారు అభినందిస్తూ మెమెంటోలను అందిచారు. గురువారం  రెండు స్టేషన్లలో మొత్తం 160మందికి మెమోంటోలను అందిచారు. ఖమ్మం

ట్రాఫిక్ ఎ సి పి రామోజీ రమేష్ , ట్రాఫిక్  సి.ఐ  కరుణాకర్ , ఖానాపురం హావేలి సి ఐ వెంకన్న బాబు ఈ మెమెంటోలను తమ పోలీస్ సిబ్బందికి అందించారు.

కరోన సమయంలో ప్రాణాలకు తెగించి, కుటుంబాలను వదిలిపెట్టి ముందు వరుసలో నిలిచి సేవాలందించారని, వారి సేవలు చిరస్మరణీయం అని అందుకే వారిని అభినడంచడంలో భాగంగా వారికి మెమెంటోలను అందజేస్తున్నామని ఎన్నారై ఫౌండేషన్  అధ్యక్ష, కార్యదర్శులు బోనాల రామకృష్ణ , బండి నాగేశ్వరరావు, పసుమర్తి రంగారావు, తెలిపారు.

ఈ సందర్భంగా ఖమ్మం ట్రాఫిక్ ఎ సి పి  రామోజీ రమేష్  మాట్లాడుతూ అనునిత్యం సమజాసేవలో ఉండి వివిధ సేవకార్యక్రమాలు నిర్వహిస్తున్న పోలీసుల సేవలను కూడా గుర్తించి నందుకు వారికి  కృతజ్ఞతలు తెలియజేశారు. తమసేవలను గుర్తించి అభినందించిన దాతలను ధన్యవాదాలు తెలుపుతూ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.

Related posts

‘మోదీ’ ఇంటి పేరుపై వ్యాఖ్యలకు రాహుల్‌ కు సమన్లు

Sub Editor

ప్రపంచ సినిమా చూపు తెలుగు సినిమా వైపు

Satyam NEWS

విక్టరీ డిసైడెడ్: ఇక్కడ 90 శాతం ఓట్లు కవితకే

Satyam NEWS

Leave a Comment