39.2 C
Hyderabad
May 4, 2024 21: 21 PM
Slider శ్రీకాకుళం

మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు వేతనాలు ఇవ్వాలి

#Mid day meals

మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికులకు కరోనా కాలంలో వేతనాలు వెంటనే చెల్లించి, పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ ఈ నెల 21న కలెక్టరేట్ వద్ద ధర్నా చేయాలని నిర్ణయించారు.

ఈ ధర్నా కార్యక్రమంలో కార్మికులు పెద్ద ఎత్తున  పాల్గొని జయప్రదం చేయాలని మధ్యాహ్న భోజన పథకం శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లు మహాలక్ష్మి సీఐటీయూ కార్యాలయంలో జరిగిన మధ్యాహ్న భోజన పథకం జిల్లా సమావేశంలో పిలుపునిచ్చారు.

బి ఉత్తర అధ్యక్షతన జరిగిన సమావేశాన్ని ఉద్దేశించి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి మధ్యాహ్న భోజనం ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు అల్లు మహాలక్ష్మి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన పథకం కార్మికుల తో వెట్టి చాకిరి చేయించుకుంటున్నాయని, గత 15 సంవత్సరాలుగా పని చేస్తున్న కార్మికులుగా గుర్తించకుండా శ్రమ దోపిడీ చేస్తున్నాయని అన్నారు.

కరోనా కాలంలో రాష్ట్ర ప్రభుత్వం  అన్నిరకాల కార్మికులకు వేతనాలు చెల్లించిదని, మధ్యాహ్న భోజన కార్మికుల చెల్లించకపోవడం అన్యాయమని తీవ్రంగా విమర్శించారు. ఈ పథకంలో పనిచేస్తున్న కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణి తో వ్యవహరిస్తున్నాయని రోజుకి ఆరు, ఏడు గంటలు శ్రమ చేస్తున్నా గౌరవ వేతనం పేరుతో ఎటువంటి హక్కులు లేని వాళ్ల గా చూస్తున్నాయని విమర్శించారు.

కరోనా కాలంలో పని చేసినా కనికరించరా?

తమ ప్రాణాలను పణంగా పెట్టి పిల్లలకు రేషన్ ఇస్తూ, వంట చేస్తున్న పరిస్థితి ఉందని, కరోనా కాలంలో వంట కార్మికులు ఉపాధి లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

పెరుగుతున్న ధరలకు అనుగుణంగా బడ్జెట్ పెంపుదల లేకపోవడంతో కార్మికులకు నెలవారి వేతనాలు, బిల్లులు సక్రమంగా రావడం లేదని ప్రతి సంవత్సరం మధ్యాహ్న భోజన పథకానికి బడ్జెట్ తగ్గించుకుంటూ పోతుందని వారు తెలిపారు. ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థలకు ఈ పథకాన్ని అప్పగించేందుకు కావాలని నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నాయని విమర్శించారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటా 90: 10 శాతం వాటా లాగా ఉన్న దాన్ని మోడీ ప్రభుత్వం 60 :40 శాతంగా తగ్గించడం దారుణమని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని, మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటు స్వచ్ఛంద సంస్థలకు అప్పుడు చెప్పరాదని, పథకంలో పనిచేస్తున్న కార్మికులు కార్మికులుగా గుర్తించి కనీస వేతనాలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.

సామాజిక భద్రత సౌకర్యాలు కల్పించాలని, బడ్జెట్ పెంపుదల చేసి ఈ పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని వారు కోరారు. వర్కర్లకు హెల్పర్ లకు ప్రతి నెల 5వ తేదీ లోపు వేతనాలు చెల్లించాలని, నాణ్యమైన బియ్యం సరుకులు సివిల్ సప్లై ద్వారా పాఠశాలకు అందించాలని, ఈ పథకం అమలుకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించలని అన్నారు.

హై స్కూల్ లో పనిచేస్తున్న వారికి వేతనాలు అమలు చేయాలని, రాజకీయ వేధింపులు అరికట్టాలని, ప్రమాద బీమా సౌకర్యం కల్పించి కార్మికులను ఆదుకోవాలని ఈ సమావేశంలో డిమాండ్ చేశారు.

సమస్యల పరిష్కారం కోసం డిసెంబర్ 21వ తేదీన కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు  ఉత్తర,గౌరమ్మ ,సుశీల, గీత, సీతమ్మ ,అన్నపూర్ణ ,లక్ష్మి పాల్గొన్నారు.

Related posts

అంతిమ తీర్పులో మంగ్లీ ‘టిప్ప.. టిప్ప’ పాటకు మంచి స్పందన

Satyam NEWS

చర్లపల్లి చెరువు వద్ద సూర్యభగవానుడి దేవాలయ నిర్మాణానికి చర్యలు

Satyam NEWS

మే 17 నుంచి టెన్త్ పరీక్షలు?

Sub Editor

Leave a Comment