27.7 C
Hyderabad
May 12, 2024 06: 48 AM
Slider ముఖ్యంశాలు

కొల్లాపూర్ లో విచ్చలవిడిగా ‘‘మినరల్ వాటర్ మాఫియా’’

#minaralwaterplant

సృష్టిలో ప్రతి జీవరాశికి నీరు చాలా అవసరమైనది. మంచినీరు లేకపోతే మానవాళి లేదు. ప్రపంచంలో కేవలం 10 శాతం  నీరు మాత్రమే తాగేందుకు అనువైనది. మారుతున్న కాలక్రమంలో పెరిగిపోతున్న జనాభా వల్ల మంచినీరు కొరత రోజురోజుకూ పెరిగిపోతోంది. భూగర్భజలాలు అడుగంటడం, నీటి కాలుష్యం పెరిగిపోవడంతో మనుషుల జీవన విధానం, ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి. ఒకప్పుడు పల్లెల్లో బావులు, బోర్ల నుంచి వచ్చే నీటిని, పట్టణాలు, నగరాల్లో కుళాయి నీటిని తాగేవారు. ప్రస్తుత రోజుల్లో ప్రజలు ధనిక, పేద అనే తేడా లేకుండా మినరల్‌ వాటర్‌ను ఉపయోగించడం  మొదలుపెట్టారు.

ప్రజల తాగునీటి అవసరాలను ఆదాయ వనరుగా మార్చుకున్న వ్యాపారులు నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో  పుట్టగొడుగుల్లా వాటర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసుకున్నారు. ఈ వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలు గా వృద్ధి చెందింది. కాసులకు కక్కుర్తి పడిన వ్యాపారులు కనీస ప్రమాణాలు పాటించకుండా వాటర్‌ప్లాంట్లను నిర్వహిస్తున్నారనే  ఆరోపణలు ప్రజల ద్వారా వస్తున్నాయి. అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా  మినరల్‌ వాటర్‌ ప్లాంట్లు ఏర్పాటు చేశారని మాటలు వినిపిస్తున్నాయి.ప్లాంట్ల కాడికి వెళ్లి తీసుకుంటే పన్నెండు రూపాయలు, ఇంటికి వచ్చి సరఫరా చేస్తే 15 రూపాయలు వసూలు చేస్తున్నారు. ఎవరికి వారు రేట్లు పెంచేసుకున్నారు. వేసవి కాలంలో ప్రజల వినియోగానీ మరింత అవకాశంగా తీసుకొని  కెమికల్ వాటర్ సప్లై చేస్తున్నారని జనం నుండి ఆరోపణలు వస్తున్నాయి.

వాటర్ ప్లాంట్ల పై ఆకస్మిక దాడికి రంగం సిద్ధం..

ఇదివరకు మున్సిపాలిటీ పరిధిలో కబ్జాల పై, అక్రమ కట్టడాలపై కన్నెర్రజేసిన మున్సిపల్ కమిషనర్ సొంటే రాజయ్య ఇప్పుడు వాటర్ ప్లాంట్లపై దాడులకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ప్రజల నుండి వస్తున్న పిర్యాదులు,ఆరోపణలపై ఈ నిర్ణయం తీసుకున్నాట్లు తెలుస్తోంది. తాగునీరు తోనే ప్రజల ఆరోగ్య భద్రత ఉంటుందని కమిషనర్ రాజయ్య భావించినట్లు తెలుస్తోంది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని  ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ అంశంపై కమిషనర్ రాజయ్య మాట్లాడారు.

ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకొని వాటర్ ప్లాంట్లను తనిఖీ చేయబోతున్నట్లు చెప్పారు. ఏవిధంగా శుభ్రత పాటిస్తున్నారు. ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారనే అంశాలపై పరిశీలన చేయబోతున్నట్లు చెప్పారు. ముఖ్యంగా ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులపై వాటర్ ప్లాంట్లకు అనుమతులు ఉన్నాయా?లేవా? అనే కోణంలో  ఎంక్వయిరీ చేయబోతున్నారని తెలిసింది. కమిషనర్ రాజయ్య మాటలతోనే కాదు, చేతల్లో చేసి చూపించేవారు. చూడాలి ఎవ్వరికీ అనుమతులు ఉన్నాయో,ఎవ్వరికీ అనుమతులు లేవో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారో తనిఖీలలో బయటపడబోతుంది.

అవుట రాజశేఖర్ సత్యం  న్యూస్ నాగర్ కర్నూల్ జిల్లా

Related posts

సారా మరణాలపై సమగ్ర విచారణ జరిపించాలి: ప్రజా సంఘాల డిమాండ్

Satyam NEWS

భారత సాధికారికతకు ప్రతీక రిపబ్లిక్ డే!

Satyam NEWS

సొంత చెల్లెలిపై దుష్ప్రచారం మొదలు పెట్టిన వైసీపీ సోషల్ మీడియా

Satyam NEWS

Leave a Comment