27.7 C
Hyderabad
May 4, 2024 11: 01 AM
Slider ముఖ్యంశాలు

టెన్త్ పరీక్షలను ప్రశాంతంగా జరిగేలా చూడాలి

#suryakumari

రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ

పదవ తరగతి పరీక్షలు ఎలాంటి అవాంతరాలు జరగకుండా  ప్రశాంతంగా  నిర్వహించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణపై విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ తో కలసి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రాష్ట్రంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో  వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి మాట్లాడుతూ ఏప్రిల్ 3వ తేదీ నుండి 18వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు జరుగుతాయన్నారు.

పరీక్షలు మొత్తం 8 రోజులు జరుగుతాయని, ప్రతి రోజూ ఉదయం 9.30 నుండి మధ్యాహ్నం 12.45 గంటల వరకు జరుగుతుందని ఆయన వివరించారు. పదవ తరగతి పరీక్షలు ప్రాముఖ్యత కలిగి ఉందని, అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని అన్నారు. రవాణా సౌకర్యం కల్పించాలని ఆయన అన్నారు. పక్కా కార్యాచరణతో,  అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని ఆయన పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ సూర్య కుమారి సంబంధిత అధికారులతో మాట్లాడుతూ  తగు ఆదేశాలు జారీ చేశారు. ఏప్రిల్ నెల 3 నుండి 18 వ తేదీ వరకు జరగనున్న ఈ పరీక్షలు  ప్రశాంతంగా జరిగేలా  కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేయాలని  ఆదేశించారు. జిల్లాలో 25 మండలాల్లో 127  కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.  ఈ పరీక్షలకు 24,099 మంది రెగ్యులర్ అభ్యర్ధులు, 1,428 ప్రైవేటు అభ్యర్ధులు మొత్తం 25,527 మంది  హాజరుకానున్నారని తెలిపారు. ఉదయం 9.30 నుండి 12.30 వరకు పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు . 

పరీక్షల కేంద్రాలను తఃసిల్దార్లు, ఎం.పి.డి.ఓ లు తనిఖీ చేసి ప్రతి రోజు జిల్లా కల్లెకర్ కు నివేదికలు అందజేయలన్నారు. ప్రతి కేంద్రం వద్దా 144 సెక్షన్ అమలు జరిగేలా తహసిల్దార్లు  చూడాలన్నారు. 9  ఫ్లైయింగ్ స్క్వాడ్లను తఃసిల్దార్ల  ఆధ్వర్యం లో వేస్తున్నట్లు తెలిపారు. . ప్రశ్నా పత్రాల  కష్టోడియన్ గా జిల్లా రెవిన్యూ అధ్దికారి వ్యవహరిస్తారని తెలిపారు.  పోలీస్ శాఖ ద్వారా జరగవలసిన బందోబస్త్ ఏర్పాట్లను పటిష్టంగా ఉండేలా చూడాలని, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా అలెర్ట్ గా ఉండాలని తెలిపారు. 

స్పాట్ వాల్యుయేషన్ పూర్తి అయ్యేవరకు స్ట్రాంగ్  రూమ్ అయిన కోట హై స్కూల్ వద్ద  పోలీస్ బందోబస్త్ ఉండాలన్నారు.  ప్రతి కేంద్రం వద్దా తాగు నీటి సరఫరా ఉండాలని, వైద్య శాఖ వారు ప్రధమ చికిత్సా కేంద్రాన్ని  ఏర్పాటు చేయాలని, విద్యుత్ శాఖ వారు నిరంతర విద్యుత్  సరఫరా ఉండేలా చూడాలని అన్నారు.  ఆర్.టి.సి వారు పరీక్షా సమయాలలో  అభ్యర్ధులకు ఇబ్బందులు కలగకుండా ప్రతి గ్రామం నుండి ప్రత్యెక  బస్సు లను నడపాలని సూచించారు. సందేహాలకు, సమస్యల నివారణకు  కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడమైనదని 94943 26124  ఫోన్ నెంబర్ కు సంప్రదించాలని అన్నారు.

ఈ సమావేశం లో జిల్లా రెవిన్యూ అధికారి గణపతి రావు,  జిల్లా విద్యా శాఖాధికారి లింగేశ్వర రెడ్డి ,  డి.ఎం.హెచ్.ఓ డా.రమణ కుమారి,  డి.ఎస్.పి శేషాద్రి , పరీక్షల  అసిస్టెంట్ కమీషనర్ లక్ష్మి కుమారి,   విద్యుత్ శాఖ ఎస్.ఈ.,  డిప్యూటీ డి.ఈ.ఓ లు ఆర్.టి.సి ఆర్.ఎం తదితరులు పాల్గొన్నారు.

Related posts

వేములవాడలో కుంగిన బ్రిడ్జ్ ఘటనపై విచారణ

Satyam NEWS

శ్రీకాకుళం లో ఉపాధ్యాయులకు కరోనా పరీక్షలు

Satyam NEWS

మందుబాబులకు అడ్డాలుగా మారిన కంపోస్టు షెడ్ లు

Satyam NEWS

Leave a Comment