వేముల వాడ బ్రాంచ్ రోడ్డు లో మూల వాగుపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్ దగ్గర జరిగిన సంఘటన పై అసెంబ్లీ లో ఉన్న ఆర్.అండ్.బి శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పందించి R&B ENC రవిందర్ రావును శాసన సభకి పిలిపించి ప్రాథమిక సమాచారాన్ని తీసుకున్నారు ENC ఇచ్చిన సమాచారం మేరకు ఆ ప్రాంతంలో గత కొన్ని రోజులుగా, 13 cm భారీ వర్షాలు కురవడం మూలంగా మూల వాగు ప్రవాహం ఎక్కువై బ్రిడ్జ్ కు అమర్చిన సెంట్రింగ్ సపోర్ట్స్ లూస్ కావడంతో, సెంట్రింగ్ పక్కకి జరగడం వల్ల వేసిన ఫ్లోర్ భీమ్ వంగింది. ఇంకా స్లాబ్ కానీ, ఆర్చెస్ లు కానీ వేయలేదు. ఈ బ్రిడ్జ్ BOWSTRING TYPE TECHNOLOGY తో డిజైన్ చేశారు. ఒరిగిన ఫ్లోర్ భీమ్ ఎటువంటి లోడ్ తీసుకోదు. పైన వచ్చే ఆర్చ్ లే లోడ్ తీసుకుంటాయి. ఒరిగిన ఫ్లోర్ భీమ్ తీసివేసి మళ్ళీ వేసే బాధ్యత ఏజెన్సీ దే. వాటికయ్యే ఖర్చు 20 లక్షలు, ఖర్చు కూడా ఏజెన్సీ నే భరిస్తుంది. ఈ బ్రిడ్జ్ నాలుగు వరుసల (4 line) బ్రిడ్జ్, ఒకవైపు రెండు వరుసల బ్రిడ్జ్ వే నిర్మాణం ఇప్పటికే పూర్తి అయి వినియోగంలో ఉన్నది. ప్రస్తుతం నడుస్తున్న పని రెండో వైపున గల రెండు వరుసలు బ్రిడ్జ్ వే ది. ఏది ఏమైనా ఈ సంఘటన పై నిజ నిర్ధారణకు చీఫ్ ఇంజనీర్ ఆధ్వర్యంలో ఒక టీమ్ ను వెంటనే ఘటనాస్థలికి పంపాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు.
previous post
next post