42.2 C
Hyderabad
May 3, 2024 15: 45 PM
Slider వరంగల్

మినిస్టర్స్ వాయిస్: పల్లెలు, పట్టణాల అభివృద్ధే లక్ష్యం

errabelli dayakar

పల్లెలు, పట్టణాల అభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా స్థాయి ప్రజాప్రతినిధులు, అధికారులు,పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి సమ్మేళనంకు మంత్రి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు అభివృద్ధి బాటలో పయనిస్తున్నాయని, స్వచ్ఛ గ్రామాలు, ఆరోగ్య తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషికి ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. పల్లె ప్రగతిలో చేసిన విధంగానే.. పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని,పట్టణాల్లో అవసరమైన సదుపాయాల కోసం ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని, హరిత హారం, పారిశుద్ధ్యం, ప్రధానమని, నిర్లక్ష్యం వహించే స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను సహించేది లేదని హెచ్చరించారు.

అంతేకాక తమ ప్రాంతాల అభివృద్ధి పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతను గుర్తించాలని కోరారు. పల్లె ప్రగతి రెండు విడతల్లో కొన్ని గ్రామాల్లో అనుకున్న అభివృద్ధి జరగడం లేదని, కారణాలు ఏమున్నా ప్రతి గ్రామంలో నర్సరీలు, స్మశానవాటికల నిర్మాణాలు, డంపింగ్ యార్డుల నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు.

అదేవిధంగా ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లు, ట్రాలీలు, ట్యాంకర్ల ను సమకూర్చుకోవాలన్నారు. అభివృద్ధి కోసం నిధులకు కొరత లేదని,అవసరమైన పనులు త్వరితగతిన పూర్తి చేసేవిధంగా ప్రభుత్వం కలెక్టర్లకు అధికారాలు ఇచ్చిందన్నారు. వారం రోజుల్లో అన్ని గ్రామాలకు సదుపాయాలు పూర్తి చేయాలన్నారు. హరిత హారం ద్వారా నాటిన 85 శాతం మొక్కలు బ్రతికే విధంగా గ్రామపంచాయతీలు కృషిచేయాలి.

ఉపాధి హామీ పథకంలో గ్రామాల్లో మొక్కలను, పారిశుద్ధ్య పనులను చేపట్టాలన్నారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంతల నిర్మాణాలు పూర్తి చేయాలని,ప్రతి ఇంట్లో మొక్కలు నాటించాలని,ఇంటి ముందు చెత్త ఉంటే ఫెనాల్టీ వేయ్యాలని ఆదేశించారు. అనుమతులు లేకుండా చెట్లను నరికితే ఐదు వేల నుంచి ఐదు లక్షల వరకు జరిమానా విధించాలన్నారు.

 ప్రభుత్వ భూముల్లో ఉన్న చెట్ల వివరాలు, గ్రామ పంచాయతీలో ఉండాలని, ప్రభుత్వ స్థలాల్లో అవసరమైన చోట్ల పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణాలు, మొక్కల పెంపకం చేపట్టాలన్నారు. జనగామ జిల్లాను రాష్ట్రంలో ఆదర్శంగా నిలుపాలని కోరారు. జిల్లాలో అభివృద్ధిలో ముందంజలో ఉన్న ప్రతి మండలంలోని ఐదు గ్రామాలకు10లక్షల ప్రత్యేక నిధులు కేటాయిస్తానని ప్రకటించారు. గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను పంపిణీ చేశారు.

Related posts

ఎంత ప్రయత్నించినా పలుకని విక్రమ్

Satyam NEWS

రైస్ మిల్లు కార్మికులకు వేతనంతో కూడిన సెలవులు ప్రకటించాలి

Satyam NEWS

విజయనగరం మేయర్ గా ఆశపు సుజాత..?

Satyam NEWS

Leave a Comment