39.2 C
Hyderabad
April 28, 2024 11: 02 AM
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ నియోజకవర్గ యువతి యువకులకు శుభవార్త

#KollapurMLA

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న కొల్లాపూర్ నియోజకవర్గ యువతి యువకులకు శుభవార్త.

ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి స్థాపించిన భీరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిపుణులైన హైదరాబాద్, అవనిగడ్డ ఫ్యాకల్టీ వారిచే ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న యువతి యువకులకు ఎస్సై/ కానిస్టేబుల్/ఎక్సజ్/ పంచాయతీ సెక్రటరీ, ఉపాధ్యాయ.. అన్నిరకాల ప్రభుత్వ ఉద్యోగాలు ఆశించే వారికి 60 రోజుల పాటు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తారు.

ఆసక్తి, అర్హత ఉన్న నిరుద్యోగ యువతి యువకులు ఈనెల 20 తేదీ సాయంత్రం 5-00 గంటల వరకు కొల్లాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫారాలు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అందుబాటులో వుంటాయి.  

దరఖాస్తు ప్రక్రియ ముగిసిన వెంటనే శిక్షణ ప్రారంభం అవుతుంది. శిక్షణ ప్రారంభ తేది, వేదిక ప్రతి ఒక్క అభ్యర్థికి ఫోన్ మెసేజ్ ద్వారా తెలియచేస్తారు.

పూర్తి వివరాలకు సంప్రదించవలసిన నెంబర్లు:- 9652003170, 9182546758, 6281962941.,9951550009.

Related posts

శ్రీశైలంలో 12 నుంచి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

Satyam NEWS

శ్రీలంక ప్రధానమంత్రికి భారతీయ సంస్కృతి సంప్రదాయాలతో ఘన స్వాగతం

Satyam NEWS

పెద్దకొత్తపల్లి గురుకుల విద్యార్థికి హైజంప్ లో గోల్డ్ మెడల్

Satyam NEWS

Leave a Comment