33.7 C
Hyderabad
April 29, 2024 01: 41 AM
Slider విజయనగరం

టెన్త్ ప‌రీక్షా కేంద్రాల‌లో విజయనగరం జిల్లా క‌లెక్ట‌ర్ ఆక‌స్మిక త‌నిఖీలు

#surprisevisit

గ‌డ‌చిన‌ రెండు రోజుల నుంచీ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్ష‌లు ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగా విజ‌య‌నగ‌రం జిల్లాలో కూడా టెన్త్ ప‌రీక్ష‌లను అత్యంత ప‌క‌డ్బందీగా నిర్విహిస్తో్ంది..జిల్లా విద్యాశాఖ‌. ఈ మేర‌కు న‌గ‌రంలో అదీ మూడులాంత‌ర్ల వ‌ద్ద ఉన్న క‌స్మా హైస్కూల్లో జ‌రుగుతున్న ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షా కేంద్రాన్ని జిల్లా క‌లెక్ర‌ట్ సూర్య‌కుమారీ ప‌రిశీలించారు.

న‌గరంలోని  కస్పా మునిసిపల్ హైస్కూల్ లో మొద‌టి అంత‌స్థులో జ‌ర‌గుతున్న ప‌రీక్షా కేంద్రాన్ని  సందర్శించారు… జిల్లా కలెక్టర్ సూర్యకుమారి.కేంద్రంలోని  పదో తరగతి పరీక్షలు జరుగుతున్న తీరును క‌లెక్ట‌ర్ పరిశీలించారు. పలు క్లాస్ రూమ్ ల‌ను తనిఖీ చేసి జ‌రుగుతున్న పరీక్షల నిర్వహణపై ఆరా తీసారు… జిల్లా కలెక్టర్.ఇక్క‌డే  క‌లెక్ట‌ర్ కు.ప‌రీక్షా కేంద్రంలో విద్యార్ధినీలు ప‌రీక్ష రాస్తున్న విధానాన్ని నిశితంగా ప‌రిశీలించారు.

కొంద‌రు చేయి అడ్డం పెట్టుకుని రాయ‌డం మరికొంద‌రు…మోచేతిని పేప‌ర్ పై పెట్టుకుని రాయ‌డం..ఇంకొంద‌రు. ..పేప‌ర్ పై ముఖం  అడ్డం పెట్టుకుని రాయడాన్ని గ‌మించారు..క‌లెక్ట‌ర్. దీంతో..తాను  రాసింది ప‌క్క వాళ్లు చూడ‌కూడ‌ద‌నే ఉద్దేశ్యం మంచిచే దాని…అడ్డ‌దిడ్డంగా కూర్చునొ ప‌రీక్ష రాయ‌డం స‌బ‌బు కాద‌ని..విద్యార్ధినీల‌తో మాట్లాడ‌కుండానే…..ప‌రీక్ష రాసే విధానంపై విద్యార్ధులు ప‌డుతున్న అస్త‌వ్య‌స్థ అవ‌స్థ‌ల‌ను సరిదిద్దారు. అనంత‌రం హైస్కూల్ హెచ్ ఎం తో మాట్లాడుతూ…స్కూల్ వాతావరణం బాగుందని కొనియాడారు. ఈ  ఆకస్మిక ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌జాపౌర సంంబంధాల‌,స‌మాచారా స‌హాయ సంచాల‌కులు డీ.ర‌మేష్,క‌లెక్ట‌ర్ వ్య‌క్తిగ‌త కార్య‌దర్శి అశోక్ లు ఉన్నారు.

ప‌దో త‌ర‌గ‌తి ప‌రీక్షా కేంద్రాల వ‌ద్ద పోలీస్ బందోబ‌స్తు

ఇటీవ‌ల జిల్లాలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌రిగిన సంగ‌తి గుర్తోంది క‌దా…పోలింగ్ కేంద్రాల వ‌ద్ద ఎన్నిక‌ల నియమావ‌ళి సూచించిన‌ట్టుగ గ‌ట్టిగానేపోలీసులతో  బందోబ‌స్తు నిర్విహించారు…జిల్లా పోలీస్ బాబు. సరిగ్గా అలానే మ‌రోసారి  పోలీస్ శాఖ‌… లా అండ్ ఆర్డ‌ర్ విధుల‌ను కాస్త ప‌క్క‌కు పెట్టి…జరుగుతున్న టెన్త్ ప‌రీక్ష‌ల పై దృష్టి పెట్టింది. మాల్ ప్రాక్టీస్ జ‌ర‌గ‌కుండా…పేప‌ర్ లీకేజ్ అవ్వ‌కుండా…ప‌రీక్షా కేంద్రాల‌కు స్లిప్ లు ద‌రి చేర‌కుండా….జిల్లా విద్యా  శాఖ …కోరిన‌ట్టు పోలీస్ శాఖ త‌మ‌,త‌మ సిబ్బందిని ఆయా పరీక్షాల కేంద్రాల వ‌ద్ద నియ‌మించింది.

సంబందిత స్టేష‌న్ ఎస్ఐ ఆధ్వ‌ర్యంలో… ఒక్కో మండ‌లంలో…ఉన్న  మూడు,నాలుగు పరీక్షా కేంద్రాల వ‌ద్ద‌… త‌మ‌, త‌మ స్టేష‌న్ సిబ్బందిని నియ‌మించింది….పోలీస్ శాఖ‌. ఇందులో  బాగంగా జిల్లాలో వివిధ పరీక్ష కేంద్రాల్లో జ‌రుగుతున్న ప‌దో త‌ర‌గ‌తి పబ్లిక్ పరీక్షలలో ఎటువంటి అవకతవకలు జరగకుండా జిల్లా ఎస్పీ దీపిక‌ ఆదేశాలతో ఆయా పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేసి, సంబంధిత అధికారులు భద్రతను పర్యవేక్షించారు.

Related posts

రఘురామకృష్ణంరాజును లాకప్ లో నిజంగానే కొట్టారా?

Satyam NEWS

 తుమ్మల పయనమెటు

Murali Krishna

కార్పొరేట్ వైద్యానికి ముఖ్యమంత్రి కెసిఆర్ సహాయం

Satyam NEWS

Leave a Comment