ఖైరతాబాద్ రవాణా కార్యాలయంలో శాఖ అధికారులు, ఉద్యోగుల ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సరం-2020 క్యాలెండర్, జనవరి-2020 సంచిక, డైరీ ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రికి సంస్థ అధికారులు, ఉద్యోగులు నోట్ పుస్తకాలు ఇచ్చిక నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం కేక్ కట్ చేసి అధికారులకు, ఉద్యోగులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ రవాణా శాఖ, RTC తనకు రెండు కళ్ళు లాంటివని అన్నారు. ఈ కార్యక్రమంలో RTC మేనేజింగ్ డైరెక్టర్ సునీల్ శర్మ, ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ సందీప్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.