40.2 C
Hyderabad
April 29, 2024 16: 11 PM
Slider పశ్చిమగోదావరి

పవిత్రమైన వైద్య వృత్తిని అపవిత్రం చేయవద్దు

ఈ ప్రపంచం లో వైద్య వృత్తి లో ఉన్న సంతృప్తి ఏ వృత్తిలో లేదని అటువంటి పవిత్రమైన వృత్తికి నేటి తరం వైద్యులు అ పవిత్రత ఆపాదిస్తూ కార్పొరేట్ స్థాయిలో వైద్యం వ్యాపారంగా మార్చేసి సామాన్యుడికి అందని ద్రాక్ష లా చేశారని విజయ వాడకు చెందిన ప్రముఖ న్యూరాలజీ వైద్యులు డాక్టర్ గోపాళం శివన్నా రాయణ ఆవేదన వ్యక్తం చేశారు.శనివారం ఏలూరులో ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ ఆద్వర్యం లో జరిగిన నేషనల్ డాక్టర్స్ డే సందర్భం గా ఏర్పాటుచేసిన సెలబ్రేషన్స్ కార్యక్రమం లో డాక్టర్ శివన్నా రాయణ విశిష్ట అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భం గా ఆయన మాట్లాడుతూ సమాజానికి చిన్న రోగం వచ్చి నప్పుడు ఆ జబ్బు తీవ్రతను బట్టి వైద్యం చేయాల్సిన కొంత మంది వైద్యులు చిన్న జబ్బుకు పెద్ద వైద్యం చేసి రోగులను ఆర్థికంగా నిలువు దోపిడీ చేస్తు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు .సమాజం లో ప్రజలకు సమస్యలొచ్చినప్పుడు పరిష్కారం కూడా ఉంటుందన్నారు.అలాగే రోగం వచ్చినప్పుడు మందులు కూడా ఉన్నాయన్నారు.రోగం తీవ్రతను బట్టి వైద్యం అందించాలి గాని బ్రోకర్ ని బ్రతికించడం కోసం కొంత మంది వైద్యులు రోగిని ఆర్థికంగా పిండేస్తున్నారని విమర్శించారు.

ఒక సమస్య పోలీస్ స్టేషన్ కెళ్లినప్పుడు ముందుగా ఎస్ ఐ కి పిర్యాదు చేస్తారని .పరిస్థితి బాగోక పోతే సి ఐ దగ్గరకు లేదా డి ఎస్ పి దగ్గరకు మరీ సీరియస్ గా ఉంటే ఎస్ పి దగ్గరకెళ్ళాల్సి వస్తుం దని .సమస్య మరింత ముదిరితే ముందుగా జిల్లా కోర్టు కి తరువాత హై కోర్ట్ కి ఆ తరువాత సుప్రీం కోర్ట్ కెళతామని గుర్తు చేశారు.అలాగే అనారోగ్యం తో రోగి డాక్టర్ దగ్గరకొచ్చినప్పుడు ప్రాధమికం గా పరీక్షలు చేసి వైద్యం చేయాలి గాని అవన్నీ వదిలేసి ఏకంగా.డి ఎస్ పి ని వదిలేసి ఎస్ పి దగ్గరకెళ్లినట్టు.పిజిషియన్ స్థాయి లో వైద్యం చేయకుండా సర్జన్ దగ్గర కెళితే ఆయన రోగమెం టో ప్రాధమికం గా నిర్దారించి వైద్యం చేయకుండా ఏకం గా సర్జన్ దగ్గరకెళ్లాడని ఆరోగ్యశ్రీ పథకం ఉండికదా అని లేని జబ్బుకు గుండె కు బై పాస్ సర్జరీలు చేసేస్తున్నారని ఇటువంటి పరిస్థితి నేటి సమాజం లో కార్పొరేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్న పరిస్థితిని గుర్తు చేశారు.

పూర్వం వైద్యులు నిస్వార్థం గా వైద్యసేవాలందించేవారన్నారు. ఆరోజుల్లో వైద్యులు ఎదురైతే ప్రాణం పొసే వైద్యులని దణ్ణం పెట్టేవారని చెప్పారు.ఆ తరానికి చెందిన వైద్యులు ఏలూరులో డాక్టర్ జి ఎస్ ప్రసాద్.డాక్టర్ రావి గోపాలకృష్ణయ్య.డాక్టర్ యార్లగడ్డ జగన్మోహన్ రావు నిస్వార్థంగా సేవలందించారని చెప్పారు.నేటి సమాజం లో డాక్టర్ కి రోగికి మధ్య ఏర్పడిన దళారి వ్యవస్థ పెరిగిపోయిందని డాక్టర్ శివన్నా రాయణ అన్నారు.

Related posts

జగన్ లేఖ ను ఖండించిన ఆలిండియా బార్ అసోసియేషన్

Satyam NEWS

విమానాన్ని ఆపిన ఎయిర్ ఇండియా పెంపుడు ఎలుక

Satyam NEWS

కష్టపడితేనే ఉన్నత స్థానాలకు చేరుకోగలం

Satyam NEWS

Leave a Comment