కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శుభం ఫంక్షన్ హాల్ లో వ్యాసోజుల వారి ఉపనయన మహోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు పాల్గొన్నారు. కార్యక్రమానికి వచ్చిన మంత్రికి బాజా భజంత్రీలతో ఘనస్వాగతం పలికారు. ఉపనయన కార్యక్రమంలో పాల్గొని కాసేపు గడిపారు.
టిఆర్ఎస్ నాయకులు మంత్రి హరీష్ రావు ను కలిశారు. కలిసిన ప్రతి ఒక్కరినీ మంత్రి ఆప్యాయంగా పలకరించారు. మంత్రి హరీష్ రావు తో సెల్ఫీలు దిగడానికి పలువురు పోటీ పడ్డారు. హరీష్ రావు సుమారు అరగంట పాటు ఫంక్షన్ హల్ లో ఉన్నారు. అనంతరం ఆయన హైదరాబాద్ తిరుగు ప్రయణమయ్యారు.