Slider హైదరాబాద్

ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వాడద్దు క్లాత్ బ్యాగులే ముద్దు

tsiic 23

పరిశ్రమ భవన్ టీఎస్ ఐఐసీ కార్యాలయంలో ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల స్థానంలో తయారు చేసిన క్లాత్ బ్యాగులను సంస్థ  ఎండి ఈవీ నర్సింహారెడ్డి ఇవాళ విడుదల చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలోని టీఎస్ ఐఐసీ ఆధ్వర్యంలోని ఇండస్ట్రియల్ పార్కులలో ప్లాస్టిక్  బ్యాగులను  వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని  అధికారులను ఆదేశించారు. ప్లాస్టిక్ వాస్తవుల వినియోగం వల్ల క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు సోకె ప్రమాదం ఉందన్నారు. సమాజంలో ప్లాస్టిక్ డిస్పోజల్ వస్తువుల వాడకం విపరీతంగా  పెరిగిపోవడమే  అనర్థాలకు కారణమవుతుందని హెచ్చరించారు. సంస్థలో  పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా ప్లాస్టిక్ వస్తువుల స్థానంలో ప్రత్యామ్నాయ వస్తువులను వినియోగించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని  సూచించారు. ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని అందరూ మూడు మొక్కలు నాటి మిత్రులకు కూడా మూడు మొక్కలు నాటే లా చూడాలని ఎండి నర్సింహారెడ్డి సూచించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ ఐఐసీ ఫార్మా , లైఫ్ సైన్సె స్ డైరెక్టర్ శక్తి నాగప్పన్, జిఎంలు రేవతి బాయి, నరసింహన్, డిజీఎం మహేశ్వర్, విఠల్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

మహా శివరాత్రి జాగరణ ఉత్సవాల కరపత్రం ఆవిష్కరణ

Satyam NEWS

పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్న కుటుంబం

Satyam NEWS

జూనియర్ కబడ్డీ జట్ల ఎంపిక ఆరంభం

Satyam NEWS

Leave a Comment