37.2 C
Hyderabad
May 6, 2024 11: 46 AM
Slider ఖమ్మం

వాడ వాడ లో మంత్రి పువ్వాడ

#puvvada

వాడ వాడ పువ్వాడ కార్యక్రమంలో భాగంగా ఖమ్మం నగరంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి డివిజన్ లోని ఇంటింటికి నేరుగా వెళ్లి ప్రజలను నేరుగా కలుసుకుని వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక నివాస ప్రజలు వివరించిన ఆయా సమస్యలు తక్షణమే పరిష్కరించాలని అదనపు మున్సిపల్ కమిషనర్ మల్లీశ్వరి అదేశించారు. విద్యుత్, త్రాగునీరు, పారిశుధ్యం, డ్రెయిన్లు తదితర సమస్యలను ఉన్నట్లు స్థానికులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అసంపూర్తిగా ఉన్న సైడ్ కాల్వల మరమ్మతులు చేపట్టాలని, అవసరం అయ్యే చోట కొత్త సైడ్ కాల్వలకు ప్రతిపాదనలు సిద్దం చేయలని అధికారులను మంత్రి సూచించారు. బైపాస్ రోడ్ నాగభూషణం కిరణం వద్ద గల ఇళ్ళ ప్రజలు పలు సమస్యల ను వివరించారు. వంగి ఉన్న విద్యుత్ స్తంబాలు, ప్రమాదకరం గా ఉన్న స్తంబాలు తక్షణమే తొలగించాలని విద్యుత్ అధికారులను అదేశించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకం గా చేపడుతున్న కల్యాణ లక్ష్మీ, షాది ముభారక్, ఆసరా పెన్షన్లు, ఇతర అనేక సంక్షేమ పథకాలు క్షేత్ర స్థాయిలో అందాలనే ప్రజలను నేరుగా కలిసి అడిగి తెలుసుకుంటున్నామని పేర్కొన్నారు.

హైదరాబాద్ నగరం తరువాత అంత వేగంగా ఖమ్మం దినదినాభివృద్ధి చెందుతోంది అని, ఖమ్మం నగరంలో ప్రజలకు నిత్యావసరం అయిన వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కేట్ ఏర్పాట్లు చేశామని, ఇటీవలే రూ. 180 కోట్లతో ఖమ్మం మున్నేరు పై తీగల వంతెన నిరణం కొరకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, అభివృధిలో వెనుకడుగు వేయకుండా ప్రజలకు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి చేయాల్సిన అభివృద్ధిపై మరింత దృష్టి పెడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట నగర్ మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, కార్పొరేటర్లు మోతారపు శ్రావణి, రాపర్తి శరత్, మునిసిపల్ ఇఇ క్రిష్ణ లాల్, పబ్లిక్ హెల్త్ ఇఇ రంజిత్, విద్యుత్ ఏడిఇ రమేష్, మాజి డిప్యూటీ మేయర్ బత్తుల మురళీ, సుధాకర్ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు .

Related posts

ఎమ్మెల్యే కుమారుడిపై ఎస్సీ,ఎస్టీ కేసుకు సంఘాల డిమాండ్‌

Sub Editor

స్విచ్ ఆఫ్: గ్రిడ్ కు ప్రమాదం రాకుండా చర్యలు తీసుకున్నాం

Satyam NEWS

శాఖా సిబ్బంది సమస్యలకు “పోలీసు సంక్షేమ దినోత్సవం”:ఎస్పీ దీపికా

Satyam NEWS

Leave a Comment