38.2 C
Hyderabad
April 29, 2024 19: 06 PM
Slider నల్గొండ

వీధి కుక్కల స్వైర విహారం అరికట్టండి

#streetdogs

సూర్యాపేట జిల్లా  హుజుర్ నగర్ పట్టణంలోని అన్ని వార్డుల పరిధిలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. 5వ, వార్డు పరిధిలో ఎక్కువగా విద్యాసంస్థలు ఉండడంతో విద్యార్థుల తల్లితండ్రులు, ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రియదర్శిని కళాశాల, చైతన్య స్కూల్, కృష్ణవేణి హైస్కూల్, చైతన్య గ్రామర్ హైస్కూల్, గ్రీన్ వుడ్ స్కూల్ లాంటి విద్యా సంస్థలు వార్డు పరిధిలో ఉండటంతో ప్రతిరోజు హుజూర్ నగర్,పరిసర ప్రాంతాల నుండి విద్యార్థులు నిత్యం రాకపోకలు కొనసాగిస్తుంటారు.

ఈ ప్రాంతంలో వీధి కుక్కలు పిల్లలపై ఎగబడుతుండడం వలన విద్యార్థులు,వారి తల్లితండ్రులు భయబ్రాంతులకు గురౌతున్నారు. అదేవిధంగా అన్ని వీధుల్లో వీధి కుక్కలు సంచరిస్తూ ప్రజలను ఇబ్బందులు కలిగిస్తున్నాయని, అధికారులు పట్టించుకోవడడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. కుక్కల వలన ప్రమాదం జరిగినప్పుడు హడావిడి చేయడం ఆ తర్వాత వదిలేయకుండా వీధి కుక్కల నుండి విముక్తి కల్పించాలని గతంలో అధికారులకు ఎన్నోసార్లు విన్నవించినా పట్టించుకున్న దాఖలాలు లేవని ప్రజలు వాపోతున్నారు.

వీటి వలన రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని ఇప్పటికైనా అధికారులు స్పందించాలని కోరారు. వీధి కుక్కల బెదడ ఎక్కువైతే మున్సిపాల్టీ అధికారులు ఆ కుక్కలను పట్టుకుని నిర్మానుష్య ప్రదేశంలో వదిలిపెట్టాల్సిన బాధ్యత అధికారులదే కనుక తక్షణమే స్పందించి వీధి కుక్కల సమస్యను పరిష్కరించాలని కోరుతూ శనివారం హుజూర్ నగర్ మున్సిపాలిటీ కార్యక్రమంలో కమీషనర్ అందుబాటులో లేకపోవడంతో మేనేజర్ కి జనచైతన్య ట్రస్ట్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జనచైతన్య ఫౌండర్ పినపారాళ్ల వంశీ,చైర్మన్ పారా సాయి, ఉపాధ్యక్షుడు పిల్లి శివశంకర్,శ్రీపతి,వెంకీ, రమేష్,జయంత్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

ములుగు జిల్లా టీచర్ బదిలీలకు మార్గదర్శకాలు

Satyam NEWS

నమ్మితే నట్టేటా ముంచారు.. రూ.55 లక్షల పైగా దోపిడీ

Sub Editor

హైదరాబాద్ ఎయిర్ పోర్టులో భారీ ఎత్తున హెరాయిన్ స్వాధీనం

Satyam NEWS

Leave a Comment