రాబోయే ఐదేళ్లు ప్రజలకు అందుబాటులో ఉండి న్యాయంగా పని చేసే నేతలను ఎన్నుకోవాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి పిలుపునిచ్చారు. రేపు జరగబోయే మునిసిపల్ ఎన్నికల పోలింగ్ కి ఎన్నికల సంఘం పూర్తి ఏర్పాట్లు చేసిందని ఆయన తెలిపారు. ఎన్నికల సందర్భంగా జరిగే పోలింగ్ ఏర్పాట్లలో 55 వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారని నాగిరెడ్డి తెలిపారు.
ప్రతి ఒక్క ఓటరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ జరుగుతుందని ఆయన తెలిపారు. ఎన్నికల్లో ధన ప్రభావం ఉందని ఫిర్యాదులు వచ్చాయని అయితే నిధుల పంపిణీని రాజకీయ పార్టీలే అడ్డుకోవాలని ఆయన అన్నారు. రాజకీయ పార్టీలు డబ్బులు పంపిణీ చేసి లెక్కలు చూపించకపోతే ఎన్నిక రద్దు చేస్తామని ఆయన అన్నారు.