38.2 C
Hyderabad
April 28, 2024 22: 35 PM
Slider నిజామాబాద్

గొప్ప కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది

#vemula

కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ లాంటి గొప్ప కార్యక్రమంలో తనకు భాగస్వామ్యం కల్పించినందుకు సంతోషంగా ఉందని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా, మానవత్వంతో తల్లి, బిడ్డ కోసం మంచి కార్యక్రమం ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈరోజు పుట్టబోయే బిడ్డలే, మన జాతి సంపద అని, వారు బాగుంటే దేశం బాగు పడుతుందన్నారు. బుధవారం కామారెడ్డి కలెక్టరేట్ నుంచి వర్చువల్ మోడ్ లో రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పంపిణీ కార్యక్రమాన్నిమంత్రి హరీశ్ రావు ప్రారంభించారు.

స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు హన్మంత్ షిండే, జాజాల సురేందర్ పాల్గొన్నారు. కేసీఆర్ కిట్ ద్వారా 16 వస్తువులతో పాటు, తల్లి బిడ్డకు మనం 12 వేల రూపాయలు ఇస్తున్నామని తెలిపారు. ఆశ వర్కర్లు అమ్మగా కనిపిస్తున్నారని,  గొప్పగా పని చేస్తున్నారని కొనియాడారు. అరోగ్య శాఖలో ఇంత పని ఉంటుందని మంత్రి హరీశ్ రావు చూపిస్తున్నారని ప్రశంసించారు. సీఎం కేసీఆర్ ఆరోగ్య తెలంగాణ లక్ష్యం వైపు రాష్ట్రం వేగంగా అడుగులు వేస్తున్నారన్నారు.

తల్లులు క్షేమంగా ఉంటే సమాజం క్షేమంగా ఉంటుంది

తల్లులు క్షేమంగా ఉంటే సమాజం క్షేమంగా ఉంటుందని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తల్లులు ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకున్నారు కాబట్టి నాడు సాధారణ ప్రసవాలు జరిగాయన్నారు. తల్లులు క్షేమంగా ఉంటే సమాజం క్షేమంగా ఉంటుందని, అందుకే సీఎం కేసీఆర్, కేసీఆర్ కిట్స్, న్యూట్రిషన్ కిట్స్ ప్రారంబించారని చెప్పారు. ఇప్పటివరకు 12 లక్షల మంది కిట్స్ అందుకున్నారన్నారు. ఈ దేశానికి కావాల్సింది రాజకీయ నాయకుడు కాదని, ప్రజా నాయకుడన్నారు. ప్రభుత్వాలు పడగొట్టే ప్రయత్నానికి ఉన్నవారు ఎందుకని ప్రశ్నించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, జెడ్పి చైర్ పర్సన్ శోభ, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతా మహంతి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్, జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ షిండే, కలెక్టర్ జిటేష్ వి పాటిల్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ ఇందూ ప్రియ, అధికారులు పాల్గొన్నారు.

క్రిటికల్ కేర్ నిర్మాణానికి శంకుస్థాపన

దేవునిపల్లి శివారులో ఎంసిహెచ్ ఆస్పత్రి పక్కనే 23.75 కోట్లతో నిర్మించనున్న 50 పడకల క్రిటికల్ కేర్ సెంటర్ కు మంత్రులు హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం పక్కనే నూతనంగా నిర్మిస్తున్న మాతా శిశు ఆస్పత్రి పనులను పరిశీలించారు. ఆస్పత్రి నిర్మాణ పనులను అధికారులు, కాంట్రాక్టర్ ను అడిగి తెలుసుకున్నారు. మార్చి లోపు ఆస్పత్రి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఇప్పటికే మెడికల్ కళాశాల మంజూరైనందున ఆస్పత్రి పనులు త్వరగా పూర్తి చేస్తే మెడికల్ కళాశాల విద్యార్థులకు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి క్లాసులు ప్రారంభించుకోవచ్చని సూత్రప్రాయంగా నిర్ణయించారు.

Related posts

దార్శనికుడు, సంస్కరణలకు ఆద్యుడు పివి నరసింహారావు

Satyam NEWS

వెరైటీ కామెడీతో అల్లరి సునామీ సృష్టించే చిత్రం సర్వం సిద్ధం

Satyam NEWS

స్వీట్లే కాదు సమాజానికి స్ఫూర్తిని పంచిన పుల్లారెడ్డి

Satyam NEWS

Leave a Comment