వికారాబాద్ జిల్లాలో మరో కామాందుడు పెట్రేగిపోయాడు.పరిగిలోని బీసీ కాలనీలో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి సాయి అనే యువకుడు ఊరి చివరకు తీసుకెళ్లి ఆమెపై ఆత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో బాలిక భయపడుతూ అరుపులు పెట్టడంతో ఈ విషయం బయటపడింది. చికిత్స నిమిత్తం బాలికను ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.