32.7 C
Hyderabad
April 27, 2024 01: 19 AM
Slider ఆదిలాబాద్

ప్రజల భద్రత కోసమే పోలీసుల కార్డెన్ అండ్ సెర్చ్

nirmal sp

ప్రజలకు భద్రతపై భరోసా కల్పించడం కోసమే పోలీసులు కార్డెన్ అండ్ సెర్చ్ నిర్వహిస్తారని నిర్మల్ జిల్లా ఎస్పీ సి.శశిధర్ రాజు తెలిపారు. నేడు పట్టణంలోని సిద్దాపూర్ లో ఎస్పీ శశిధర్ రాజు ఆధ్వర్యంలో పోలీసులు “కార్డన్‌ & సెర్చ్‌”నిర్వహించారు.

నేరాల నియంత్రణ కోసం 24 పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్నామని, నేరస్థులను గుర్తించేందుకు  పోలీసులు ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటున్నారని ఆయన అన్నారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేని 43 ద్విచక్రవాహనాలను,  09 ఆటోలు  పోలీసులు స్వాధీనం చేసుకొని పోలీస్టేషనుకు తరలించారు. అనుమానాస్పద వ్యక్తుల వేలిముద్రలను తీసుకుంటామని దీనివల్ల నేరం జరిగినప్పుడు నేరస్తులను ఆధునిక టెక్నాలజీ ద్వారా గుర్తిస్తామని ఎస్పీ అన్నారు.

 రాబోయే మున్సిపల్ ఎన్నికలలో ఎలాంటి గొడవలను సృష్టించకూడదని అలాగే ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. కాలనీలో ఎవరైనా కొత్త వ్యక్తులు  సంచరిస్తూ ఉంటే స్థానిక పోలీసువారికి సమాచారం ఇవ్వాలని, కొత్త వ్యక్తులకు ఇంటిని అద్దెకు ఇచ్చేటప్పుడు వారి ఆధారాలు లేనిదే ఇంటిని అద్దెకు ఇవ్వరాదని చిరునామా, ఆధార్ కార్డులు చూసిన తరువాతనే ఇంటిని అద్దెకు ఇవ్వాలని స్థానికులకు వివరించారు.

అదే  విధంగా నేరాల నియంత్రణ కోసం ప్రతి ఒక్కరు సి.సి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవససరం వుందని తెలిపారు. కాలనీలలో/గ్రామాలలో  నేరాలను నియంత్రించడంతో పాటు, నేరస్తులను గుర్తించేందుకు కాలనీలలో/గ్రామస్తులు పోలీసుల భాగస్వామ్యంతో సి.సి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఎలాంటి అత్యవసర సమయములో అయిన డైల్ 100 కు గాని, సమీప పోలీస్ స్టేషన్ కు గాని సమాచారం అందించాలని సమాచారం ఇచ్చిన వారి పేరు గోప్యంగా ఉంచుతామని అన్నారు.

హెల్మెట్ లేకుండా వాహనాలు నడపరాదని, యాక్సిడెంట్ జరిగినపుడు కుటుంబ పెద్ద లేకపోతే లోటు ఏర్పడుతుందని ఈ విషయాన్ని గుర్తుంచుకుని జాగ్రత్తగా వాహనాలు నడపాలని ఎస్పీ సూచించారు. అంతరం పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా సిద్ధాపూర్ గ్రామంలో జిల్లా ఎస్పీ సి.శశిధర్ రాజు  పాల్గొని చిన్న పిల్లలకు పల్స్ పోలియో చుక్కలను మందు వేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్ రావు, డి.ఎస్.పి.ఉపేందర్ రెడ్డి, సి.ఐ.లు,ఎస్.ఐ.లు, ఎస్.ఐ. పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై దాడి

Satyam NEWS

మీ కుటుంబ ఆస్తులపై శ్వేత పత్రం విడుదల చేయండి…!

Bhavani

బహుజన గర్జనను జయప్రదం చేయండి

Satyam NEWS

Leave a Comment