31.7 C
Hyderabad
May 6, 2024 23: 36 PM
Slider మహబూబ్ నగర్

మైనార్టీ సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం

#MLA Bandla Krishnamohan Reddy

గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు రాష్ట్రవ్యాప్తంగా ముస్లిం మైనార్టీ సోదరుల ఆర్థిక సహాయం కింద సబ్సిడీ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. 100% సబ్సిడీ ద్వారా 52 మందికి ఎమ్మెల్యే చేతుల మీదుగా చెక్కులను అందించడం జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత పాలకులు మైనార్టీలను కేవలం ఒక ఓట్లు వేసే యంత్రాలు గా ఉపయోగించుకోవడం జరిగినది. కానీ నేడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ మైనార్టీ సంక్షేమం కోసం అనేకమైన సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం జరిగింది. పార్టీలకతీతంగా ఎలాంటి మధ్యవర్తి లేకుండా నేరుగా లబ్ధిదారుల లబ్ధి పొందే విధంగా తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు.

గతంలో ఆడపిల్ల పుడితే భారం గా భావించే నాటి నుండి తెలంగాణ రాష్ట్రంలో ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని సంతోషించేబ స్థాయికి తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దే అన్నారు. గతంలో ముస్లిం మైనార్టీలను ఓటర్లుగా మాత్రమే గత పాలకులు భావించారని సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ముస్లిం ఆడబిడ్డల పెళ్లిళ్లకు షాదీ ముబారక్ పథకం ద్వారా లక్ష నూట పదహారు రూపాయలు అందిస్తున్నారన్నారు. పేద ముస్లిం విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి ప్రతి విద్యార్థి మీద లక్షా 25 వేల రూపాయలు ఖర్చు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం అన్నారు.

గద్వాల నియోజకవర్గంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం తాము కృషి చేస్తున్నామన్నారు. తొమ్మిదేళ్ల కెసిఆర్ పాలన దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని అన్ని వర్గాల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ రుణం ఓటు వేసి తీర్చుకోవాలని మూడవసారి హ్యాట్రిక్ సీఎంగా కెసిఆర్ గారిని మరొక్కసారి ఆశీర్వదించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర వినియోగదారుల ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప, ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ జంబు రామన్ గౌడ, జెడ్పి వైస్ చైర్మన్ సరోజమ్మ, వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఛైర్మన్ శ్రీధర్ గౌడ్ ఎంపీపీలు ప్రతాప్ గౌడ్ విజయ్, జెడ్పీటీసీ రాజశేఖర్, వైస్ ఎంపీపీ లు సుదర్శన్ రెడ్డి, రామకృష్ణ నాయుడు, జిల్లా సర్పంచులు సంఘం అధ్యక్షుడు మాజీద్, జెడ్పి .కోఆప్షన్ నెంబర్ ఇమాన్ సాబ్, గద్వాల ,ధరూర్, కె.టి దొడ్డి, మండలం పార్టీ అధ్యక్షులు రాముడు,డి.ఆర్ విజయ్, ఉరుకుందు, గద్వాల మండలం పార్టీ యూత్ అధ్యక్షుడు వేణు, ఆయా గ్రామ సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

భారత దేశంలో తెలుగు వారిని గుర్తించేలా చేసింది ఎన్టీఆర్

Bhavani

చేంజ్ పాలసీ:మాత్రలు వికటిస్తున్న పట్టించు కోరేం

Satyam NEWS

జనవరి 27 నుంచి లోకేశ్ పాదయాత్ర

Bhavani

Leave a Comment