39.2 C
Hyderabad
April 28, 2024 13: 14 PM
Slider ముఖ్యంశాలు

భారత దేశంలో తెలుగు వారిని గుర్తించేలా చేసింది ఎన్టీఆర్

#NTR

భారత దేశంలో తెలుగు వారిని గుర్తించేలా చేసింది ఎన్టీఆర్ అని రాష్ట్ర మంత్రి కేటీర్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా పర్యటనలో ఐటీ మంత్రి కేటీఆర్ 1369కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.ఖమ్మం లకారం టాంక్ బండ్ పై రూ.1.37 కోట్లతో నూతనంగా ఎర్పాటు చేసిన ఎన్టీఆర్ పార్క్ ను మంత్రులు కేటిఆర్, పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు.రూ.10 కోట్లతో చెపట్టినున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

రూ.2.49 కోట్లతో నిర్మించనున్న అమృత్ 2.0 అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.20వ డివిజన్ SBIT ఇంజనీరింగ్ కళాశాల రోడ్ నందు మున్సిపల్ కార్పొరేషన్ అధ్వర్యంలో రూ.71 లక్షలతో నిర్మించిన స్పోర్ట్స్ పార్క్ ను ప్రారంభించారు.ఈ సందర్భంగా కేటీర్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ఎంతో ఆప్తుడు విశ్వ విఖ్యాత నందమూరి తారక రామారావు. రాముడు ఎలా ఉంటాడో తెలీదు, కృష్ణుడు ఎలా ఉంటాడో తెలీదు మాకు రాముడైన, కృష్ణుడైన ఆయనేన్నారు.

తెలుగు వారిని భారత దేశంలో గుర్తించేలా చేసింది ఎన్టీఆర్ అన్నారు.చరిత్రలో మహనీయుల స్థానం అజరామనీయం అందులో ఎన్టీఆర్ స్థానం పదిలం అన్నారు. ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం తనకు అదృష్టం అని, మంత్రి పువ్వాడ కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే తనకు తారక రామారావు అనే పేరు ఉండటం చాలా సంతోషంగా ఉందన్నారు. దక్షిణ భారత దేశంలో హ్యాట్రిక్ విజయం ఎవరికి దక్కలేదని అది సీఎం కెసీఆర్ కి మాత్రమే సాధ్యమవుతుందన్నారు.

Related posts

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవాలి

Bhavani

టీచర్స్ బదిలీలపై హైకోర్టు విచారణ

Bhavani

సిఎం జగన్ అభీష్టానికి అనుగుణంగానే బోస్టన్ నివేదిక

Satyam NEWS

Leave a Comment