29.7 C
Hyderabad
April 29, 2024 10: 18 AM
Slider నల్గొండ

కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను సమైక్యంగా ఎదుర్కోవాలి

#CITUCHujurngar

ఈనెల26న జరిగే సార్వత్రిక సమ్మెలో గ్రామీణ హమాలీలు పెద్ద ఎత్తున పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి  కోరారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం వేపలసింగారం గ్రామంలో అసంఘటిత  రంగంలోని కార్మికులు గ్రామీణ హమాలీలకు సముగ్ర వేతన చట్టం అమలు చేయాలని రోషపతి డిమాండ్ చేశారు.

బిజెపి ప్రభుత్వం చేస్తున్న కార్మిక, రైతు, జాతి వ్యతిరేక విధానాలను కార్మిక సంఘాలు సమైక్యంగా ఎదుర్కోవాలని అన్నారు.

కార్మిక చట్టాలను రద్దు చేయాలని పేద ప్రజలందరికీ మనిషి 10 కిలోల చొప్పున సన్నబియ్యం నిరంతరాయంగా సరఫరా చేయాలని, గ్రామీణ ఉపాధి హామీ పథకం 200 రోజులు పని కల్పించాలని, రోజుకి ఆరు వందలు ఇవ్వాలని, కనీస పెన్షన్ 10,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పాల బిందెల రవి, పండగల వెంకన్న, కొండలు, వీరయ్య, అనుముల శ్రీను, సతీష్, దుర్గారావు హమాలీలు  పాల్గొన్నారు.

Related posts

ఉత్తరాఖాండ్ కు చెందిన మోస్ట్ వాంటెడ్ కాంట్రాక్ట్ కిల్లర్ అరెస్టు

Satyam NEWS

జూన్ 6 నుంచి విజయనగరం సంగీత కళాశాలలో తరంగ గానం

Satyam NEWS

చదువుకుంటేనే జీవితానికి రాణింపు: ఎంపీ ఆదాల

Bhavani

Leave a Comment