39.2 C
Hyderabad
May 3, 2024 14: 56 PM
Slider కరీంనగర్

మిస్టరీ:కాకతీయ కాలువ ప్రమాదం పై సందేహాలు

mistery on kakatheeya canal car deaths

సాధారణంగా మనం ఎటైనా వెళితే పక్కింటి వాళ్లకు చెప్పి మన ఇంటిపై కొంచెం దృష్టిపెట్టండని చెబుతూ వెళతాం లేదా బందువులకు కుటుంబ సబ్యులకు స్నేహితులకు చెప్పి వెళతాం .అలాంటిది 15 రోజులకు పైన ఓ కుటుంబం ఎటు వెళ్లిందో తెలియకుండా వారితో ఎవరు టచ్ లో లేకుండా ఎలా ఉన్నారో అర్థం కావడం లేదు.పైగా ఆమె ఒక ఏమెల్యే కి సోదరి గానే కాకుండా ప్రభుత్వ ఉద్యోగిని,ఆయనో బిజినెస్ మ్యాన్ ,వారి కూతురో మెడికో వీరు ఎటు వెళ్లారో అది ఎవరికీ చెప్పకుండా అనేదే ఒక మిస్టరీ .

వివారాల్లోకి వెళితే కాకతీయ కెనాల్ లో పడి మరణించిన పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి చెల్లెలి కుటుంబం అదృశ్యంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సోమవారం ఉదయం ఎల్‌ఎండీ కాకతీయ కెనాల్‌లో ఓ కారును పోలీసులు వెలికితీశారు. అందులో మూడు మృతదేహాలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వారు ఎమ్మెల్యే దాసరి సోదరి రాధికా,ఆమె భర్త కూతురు గా నిర్ధారించారు. కారు 20 రోజుల క్రితమే కాల్వలో పడిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

అయితే గత 20 రోజులుగా కుటుంబసభ్యులు కనిపించకపోయినా అటు ఎమ్మెల్యే గాని ,ఇటు పోలీసులు గాని ,వారి బంధువులు స్నేహితులో పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇంటి నుండి బయలు దేరి కారు తో నేరుగా కాకతీయ కెనాల్ లో పది పోయారా లేక ఎవరైనా కారును డీ కొట్టి పడేలా చేశారా అనే సందేహాలు వ్యక్త మవుతున్నాయి.

కారులో ప్రయాణిస్తున్న సత్యనారాయణ రెడ్డి పర్ఫెక్ట్ డ్రైవర్ అని అతడు విహారయాత్రలకు తానె స్వయం గా కారు నడుపుతూ వెళుతాదాని అతని బావ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చెబుతుండటం తో వారి కారు కెనాల్ లో పడటం సందేహాలకు తేరా లేపుతుంది.సత్యనారాయణ రెడ్డి తరుపు బంధువులకోలేక ఇంటి దగ్గరి వాళ్ళకో స్నేహితులకు సమాచారమివ్వకుండానే వీరు ప్రయాణం చేశే వారా తెలియాల్సి ఉంది.

ప్రభుత్వ ఉద్యోగి అని చెబుతున్న రాధికా రిటైర్మెంట్ అయ్యిందా లేకా ఇప్పుడు పని చేస్తుందా చేస్తే పాఠశాలలో సెలవు ఏమని పెట్టింది.తెలియాల్సి ఉంది.మెడిసిన్ చదువుతున్న కుటూరు సహస్ర కళాశాలలో సెలవు ఏమని పెట్టింది సెలవులు ఉంటె వారి మిత్రులతో చివరి సరి ఎప్పుడుమాట్లాడింది.అనేది తెలుసుకోవాల్సిన అంశాలు.
గ్రామీణ స్థాయిలో పేద కూలీలు కూడా సెల్ ఫామ్ ఉపయోగిస్తున్న నేటి రోజుల్లో ఎమ్మెల్యే బంధువులు రాధికా కుటుంబ సభ్యులు సెల్ లో ఎవరికీ ఎందుకు టచ్ లో లేరు,వారు 20 రోజులుగా ఎవరికీ టచ్ లోకుంటే వారి పై ఎవరికీ ఎందుకు సందేహం రాలేదు అనే అంశాలు పోలీస్ లు విచారణ జరపాల్సి ఉంది.

ప్రమాదానికి సంబంధించి ఎలాంటి వివరాలు తెలియలేదని,ఈ సంఘటన కంటే ముందే మిస్సింగ్ కేసు నమోదైందో కాలేదో తెలియాల్సి ఉందని సీపీ కమల్‌హాసన్‌రెడ్డి తెలుపుతూ విచారణ తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు

కాగా ఈ ఘటనపై ఎమ్మెల్యే దాసరి మనోహర్ స్పందిస్తూ తమ కుటుంబంలో ఎలాంటి గొడవలు లేవని తెలిపారు. తమ సోదరి కుటుంబసభ్యులు తరచూ విహార యాత్రలకు వెళ్తుంటారని ఇప్పుడు అలాగే వెళ్లారనుకున్నామని మనోహర్ వివరణ ఇచ్చారు. ఐతే ఈ సంఘటనపై అనేక అనుమానాలున్నాయని ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.పోలీస్ లు ఈ విషయమై నిష్పక్ష పాతం గా విచారణ జరిపితే ఇది ప్రమాదామా లే కుట్రనా అనే నిజాలు నిగ్గు తేలుతాయని వారు కోరుతున్నా

Related posts

Movie Up Date: విశాఖలో కోతి కొమ్మచ్చి

Satyam NEWS

నిరుపేదలకు ఆహార ప్యాకెట్లు అందిస్తున్న బిజెపి నేత

Satyam NEWS

మిల్లర్లపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి జూపల్లి

Satyam NEWS

Leave a Comment