37.2 C
Hyderabad
April 30, 2024 11: 35 AM
Slider ప్రత్యేకం

మిల్లర్లపై ధ్వజమెత్తిన మాజీ మంత్రి జూపల్లి

#millers

మిల్లర్లు తరుగు పేరుతో రైతులను మోసం చేస్తూ అక్రమ సంపాదనే ధ్యేయంగా వారి వ్యవహార శైలి ఉందని జూపెల్లి కృష్ణారావు ద్వజమెత్తారు. శుక్రవారం పెంట్లవెల్లి మండలం గోప్లాపూర్ గ్రామం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. తరుగు పేరుతో రైతులను మోసం చేస్తే సహించేది లేదని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి చెమటోడ్చి పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే తరుగు పేరుతో రైతులను మోసం చేస్తూ అక్రమ సంపాదనే ధ్యేయంగా వ్యవహరిస్తున్న మిల్లర్లపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షాల కారణంగా ఒక వైపు రైతులు నష్టపోతుంటే పంటను సకాలంలో కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మధ్య దళారులు మిల్లర్లు రైతుల పొట్ట కొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ  కలెక్టర్ కు చరవాణి ద్వారా రైతుల సమస్యలను వివరించారు. రైతులను నిండా దగా చేస్తున్నా మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని లేకుంటే రైతులతో సహా జిల్లా కలెక్టర్ ను ఆశ్రయిస్తామని హెచ్చరించారు. ఆయనతో పాటు అనుచరులు రైతులు తదితరులు ఉన్నారు.

Related posts

పంట నష్టం జరగొద్దు

Murali Krishna

మోడల్ ఎమ్మెల్యే: గిరిపుత్రుల ఆకలి తీరుస్తున్న మధన్న

Satyam NEWS

నింగి గర్జించె

Satyam NEWS

Leave a Comment