Slider ముఖ్యంశాలు

నిరుపేదలకు ఆహార ప్యాకెట్లు అందిస్తున్న బిజెపి నేత

Balraj 241

కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఆకలితో అలమటిస్తున్న పేదలను బిజెపి కేంద్ర పార్టీ కోఆర్డినేటర్ (తెలంగాణ) నూనె బాల్ రాజ్ తనదైన శైలిలో ఆదుకుంటున్నారు. లాక్ డౌన్ ప్రారంభం అయిన నాటి నుంచి హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో ఆయన పేదలకు ఆహారం పంచుతున్నారు.

నేడు సికింద్రాబాద్ లోని మహంకాళి దేవస్థానం వద్ద మునిసిపాలిటీ కార్మికులను ఆయన గౌరవించారు. అదే విధంగా అక్కడి పేదలకు, వలస కూలీలకు ఆహార ప్యాకెట్లు పంచిపెట్టారు. ఆయనతో ఈ కార్యక్రమంలో శరద్ సింగ్ ఠాకూర్, రాజ్ బ్రహ్మ తదితరులు కూడా పాల్గొన్నారు.

అదే విధంగా ఎల్లారెడ్డి గూడా, అంబేద్కర్ నగర్ లలో కూడా పేదలకు ఆహార ప్యాకెట్లు పంచిపెట్టారు. లాక్ డౌన్ సమయంలో పేదలు ఆకలితో ఉండరాదని భారతీయ జనతా పార్టీ కేంద్ర కమిటీ పిలుపునిచ్చిన విషయాన్ని బాల్ రాజ్ తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఒక పూట ఆహారం మానుకుని పేదలకు సాయం చేయాలని ప్రధాని నరేంద్రమోడీ, బిజెపి జాతీయ అధ్యక్షుడు జె పి నడ్డా, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇచ్చిన ఆదేశాల ప్రకారం అనునిత్యం పేదలకు ఆహారం పంపిణీ చేస్తున్నారు. ప్రతి రోజూ కనీసం 100 మంది వరకూ ఆయన సాయం చేస్తున్నారు. నిత్యావసరాలు, కూరగాయలు అందిస్తూ అవసరాల మేరకు వారిని ఆదుకుంటున్నారు.

Related posts

సమ్మెలో ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు కూడా పాల్గొంటారు

Satyam NEWS

సోషల్ డిస్టెన్సింగ్ తప్పని సరిగా పాటించాలి

Satyam NEWS

ఆస్తి కోసం ఇద్దరు చిన్నారులను చంపిన సోదరుడు

Satyam NEWS

Leave a Comment