Slider మహబూబ్ నగర్

300 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

గద్వాల జిల్లా కేంద్రంలోని రింగ్ రోడ్డు సమీపంలో 300 పడకల ఆసుపత్రి నిర్మాణం పనులను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమెహన్ రెడ్డి నేడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో ప్రజలకు మెరుగైన వైద్యం అందచేస్తున్నదని తెలిపారు.

అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేయడం జరుగుతుందన్నారు. ప్రతి గ్రామీణ ప్రాంతాలలో బస్తీ దవాఖానాలు ఏర్పాటు శరవేగంగా జరుగుతుందని వివరించారు. గ్రామీణ పట్టణ ప్రాంత ప్రజలు గతంలో ఏ చిన్న ఆపద సంభవించినా, ప్రమాదం జరిగినా కర్నూలు హైదరాబాదు వంటి ప్రాంతాలకు వెళ్లి చికిత్స పొందేవారని, కానీ ఇప్పుడు అన్ని సౌకర్యాలతో ప్రభుత్వ ఆసుపత్రిలోని ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం ప్రజలకు మెరుగైన వైద్యం

అందించేందుకు చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఏప్రిల్ వరకు 300 పడకల ప్రభుత్వ ఆసుపత్రి సేవలు అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బియస్ కేశవ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

“అన్నం పరబ్రహ్మ స్వరూపం…”..అన్న వేదోక్తికి అనుగుణంగా……

Satyam NEWS

అవినీతి పుట్ట వాలంటీర్ వ్యవస్థ: ఈ మాట అన్నది మనం కాదు

Satyam NEWS

మద్యం షాపుల బిజినెస్ అవర్స్ పెంపు

Satyam NEWS

Leave a Comment