26.7 C
Hyderabad
May 3, 2024 07: 31 AM
Slider ప్రత్యేకం

“అన్నం పరబ్రహ్మ స్వరూపం…”..అన్న వేదోక్తికి అనుగుణంగా……

#suryakumariias

సూర్య కుమారి విజయనగరం జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టి ఏడాదైన సందర్భంగా ప్రత్యేక కధనం

రైతు నుంచీ రాష్ట్రపతి వరకు.. సర్పంచ్ నుంచీ ప్రధానమంత్రి వరకు.. రెవెన్యూ ఇన్ స్పెక్టర్ నుంచీ ప్రిన్సిపల్ సెక్రటరీ వరకూ ఇలా ప్రతీ రంగంలో ఎవ్వరైనా పని చేస్తున్నారంటే..అయిదువేళ్లు నోట్లో వెళ్లడానికే. ఇలా ప్రతీ ఒక్కరూ పని చేస్తున్న.. పనిలో దేవుడిని..చేస్తున్న కార్యఞలో భగవత్ స్వరూపాన్ని చూసిన వారు ఏ ఒక్కరైనా ఉన్నారంటే..అది రైతు ఒక్క డే అని చెప్పగలము.

కాని బ్యూరో క్రసి విభాగంలో పనే దైవంగా భావించే అధికారి ఎవ్వరైనా ఉన్నారా అంటే అది…ఏపీలో ని విజయనగరం జిల్లా లో సరిగా ఏడాది క్రితం అంటే జులై 29వ తేదీన బాధ్యతలు చేపట్టిన ఏ.సూర్య కుమారనే చెప్పకతప్పదు.ఎందుకంటే పధకం ఏ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దాన్ని క్షేత్ర స్థాయిలో తీసుకెళ్లడఃలో కలెక్టర్ బాధ్యత అనిర్వచనీయం.మరీ ముఖ్యంగా మధ్యాహ్నం భోజన పధకం విషయంలో.. కలెక్టర్ సూర్య కుమారి పనితీరు ఎలా ఉంటుందో ఇట్టే చెప్పేయోచ్చు.

జిల్లా అధికారులు.. కాళ్లకు వేసుకున్న చెప్పు లతో..మధ్యాహ్న భోజన పధకం నిర్వహణలో దాన్ని పర్యవేక్షించే సందర్భంగా వాటితో వచ్చేసినా..ఏడాది క్రితం జిల్లా కలెక్టర్ గా బాధ్యత తీసుకున్న ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఏ.సూర్య కుమారి…తన కాళ్లకున్న చెప్పులను బయట విడిచి.. పిల్లలు తింటున్న భోజనాన్ని పరిశీలించేందుకు స్వయంగా వెళ్లడమే కాదు.. తోటి ఉద్యోగస్తులు ఆదర్శంగా ఇలా ఉండాలని చేసి చూపించారు.

ఇదీ విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్యకుమారి.జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా “సత్యం న్యూస్. నెట్”..జిల్లా పౌరసంబంధాల ,సమాచార శాఖ అందించిన సమాచారం తో అందిస్తున్న ప్రత్యేక కథనం.. ఓ సారి చూద్దాం.

జిల్లా అభివృద్ధి పై   ` ఆమె ` ముద్ర

ఏడాది పాలన పూర్తి చేసుకున్న  కలెక్టర్ సూర్య కుమారి

విద్య లో వినూత్న పద్ధతులతో ఉత్తమ ఫలితాలు

రెవిన్యూ లో పాలనాపరమైన ప్రక్షాళన

స్కిల్ డెవలప్మెంట్ తో యువతకు పెరిగిన ఉద్యోగావకాశాలు

స్పందన వినతుల పరిష్కారం లో భేష్

రాష్ట్రం లోనే మొదటి  మహిళా పారిశ్రమిక పార్క్ కు శ్రీకారం

విజయనగర జిల్లా కలెక్టర్ గా  అమెది ఒక ప్రత్యెక శైలి. ఉదయం 10 గంటలకే తన లంచ్ బాక్స్ తీసుకొని  విద్యార్ధి స్కూల్ కు వెళ్ళినట్లు  టంచన్  గా  కార్యాలయానికి  వచ్చెస్తారు.  కానీ పనులన్నీ పూర్తి చేస్తే కానీ ఇంటికి వెళ్లరు.  ఏ రోజు ఫైల్ ఆ రోజే సంతకం చేస్తారు.  పెండింగ్ ఉంచరు.. పెండింగ్ సహించరు.

రోజులో 4, 5 మీటింగ్ లున్నా ఫీల్డ్ విజిట్ కు విసుగు చెందరు..  ఉదయం ఎంత ప్రశాంతంగా ఉంటారో సాయంత్రం అయినా  అదే ప్రశాంతత, చిరునవ్వు కనపడుతుంది.  కానీ క్రమ శిక్షణ తప్పితే కఠిన చర్యలే. అదే ఆమె మార్క్.    జిల్లాకు రెండవ మహిళా కలెక్టర్ గా  గత ఏడాది జూలై 29 న బాధ్యతలు స్వీకరించిన ఎ. సూర్య కుమారి జిల్లా పాలనలో తనదైన ముద్రను వేసారు.  ఏడాది లో ఎన్నో విజయాలను స్వంతం చేసుకుంటూ జిల్లాను అభివృద్ధి పధం లో నడిపిస్తున్నారు.

కలెక్టర్ గా జిల్లాకు వచ్చే నాటికి కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమం జరుగుతోంది.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అదేశాల  మేరకు  వాక్సినేషన్ పై ప్రత్యెక దృష్టి సారించి లక్ష్యాలను  నిర్దేశించడం  ద్వారా, క్షేత్ర స్థాయి లో సమీక్షల ద్వారా  అతి తక్కువ కాలం లో  80 శాతం నుండి 100 శాతానికి వాక్సినేషన్ ప్రక్రియ ను పూర్తి చేసి రికార్డు సాధించారు.

రెవిన్యూ పాలన పై దృష్టి పెట్టి  ప్రక్షాళన  గావించారు.  ప్రతిభ, సామర్ధ్యం ఆధారంగా బదిలీలను చేపట్టారు.  సచివాలయాల తనిఖీలను పెంచి  వ్యవస్థలోని  లోపాలను చక్కదిద్ది   పాలనను  గాడిలో పెట్టడం లో కృతకృత్యులయ్యారు.

నీతి అయోగ్ సూచీలలో అన్ని రంగాలలో ముందుండి  రాష్ట్రం లో రెండవ స్థానం లో నిలపడం లో కలెక్టర్ పాత్ర అభినందనీయం.  మౌలిక వసతుల కల్పన లో  దేశం లోనే జిల్లా ప్రధమంగా నిలవడం లో కలెక్టర్ కృషి స్పష్టమౌతోంది.

ఉపాధి హామీ పధకం తో  3 నెలలో 162 కోట్ల రూపాయల తో కన్వర్జెన్స్ పనులను చేపట్టి  నిధులు వెనక్కి వెళ్ళకుండా చూడడం వలన జిల్లాలో ఆర్.బి.కే లు, సచివాలయ భవనాలు, వేల్నేస్స్ సెంటర్లు , రహదారులు, ఇతర అభివృద్ధి పనులు చురుకుగా సాగడంలో కలెక్టర్ సూచనలు, సలహాలు, సమీక్షలు ఎంతగానో తోడ్పడ్డాయి.

రాష్ట్రం లో తోలిసారిగా మహిళా పారిశ్రామిక వేత్తల కోసం కొత్తవలస వద్ద 150 ఎకరాల్లో మహిళా పారిశ్రామిక వాడకు శ్రీకారం చుట్టారు. ఔత్సాహికులైన  మహిళా పారిశ్రామిక వేత్తలకు సబ్సిడీ తో కూడిన రుణాలను అందించేందుకు  కలెక్టర్ చర్యలు తీసుకున్నారు.

అంగన్వాడీ, వైద్య శాఖల ఆధ్వర్యం లో గర్భిణీల నమోదు, పౌష్టికాహారం  అందించడం లో, రక్త హీనత లేకుండా చూడడం, బాల్య వివాహాలు, ఎర్లీ ప్రేగ్నన్స్ తదితర అంశాల పై ప్రత్యెక దృష్టి  ని పెట్టి మహిళా వికాసానికి కృషి చేసారు. సఖి గ్రూప్ లను ఏర్పాటు చసి కౌమార బాలికలకు స్కిల్ డెవలప్మెంట్, యోగా, వ్యక్తిగత పారిశుధ్యం  తదితర అంశాల పై అవగాహన కలిగించినందుకు దేశ వ్యాప్తంగా గుర్తింపు రావడమే కాకుండా ,  ప్రతి రాష్ట్రంలో, జిల్లాలో ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సర్కులర్ జారీ చేయడం విశేషం.

జిల్లా విభజనలో, పార్వతీపురం మన్యం లో  శాశ్వత కలెక్టరేట్ ఏర్పాటుకు అడ్డాపుశీల లో 106 ఎకరాలను గుర్తించడం లో, ప్రస్తుత కలెక్టరేట్ ఏర్పాటు, మనవ వనరుల తరలింపు, మౌలిక వసతుల కల్పన లో కలెక్టర్ కీలక పాత్ర పోషించారు. జిల్లాకు అవసరమగు యంత్రాంగాన్ని ఏర్పాటు చేసి ఎస్టాబ్లిష్ చేయడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు.

స్కిల్ డెవలప్మెంట్ శిక్షణల ద్వారా అనేక మంది యువతకు ఉపాధి అవకాశాలను కల్పించడం జరిగింది. విద్యార్ధులకు, యువతకు , ఉపాధ్యాయులకు అవసరమగు శిక్షణలు , మోటివేషనల్  తరగతులను  ప్రత్యేకంగా నిర్వహించారు. గ్రూప్స్ , సివిల్స్ విద్యార్ధుల కోసం అవగాహనా తరగతులను ఏర్పాటు చేసారు.

పోర్టిఫైడ్ రైస్ పై అవగాహన కల్పిస్తూ అంగన్వాడీ కేంద్రాల్లో, మధ్యాహ్న భోజన పధకం లో వినియోగించే లా చర్యలు చేపట్టారు.  బలవర్ధకమైన బియ్యాన్ని వినియోగించడం వలన పిల్లలకు, గర్భిణీలకు , బాలింతలకు పోషకాహార లోపం తలెత్తదని, బి కాంప్లెక్స్, ఇతర మినరల్స్ లభిస్తాయని అవగాహన కలిగించడం  లో ప్రత్యెక శ్రద్ధ చూపించారు.

స్పందన వినతుల పరిష్కారం లో జిల్లా ముందజ లో ఉంది. రీ ఓపెన్ కేసు లను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ అర్జీ దారుకు సంతృప్తి నిచ్చే సమాధానాలను అందించడం లోను, గడువు లోపలే సమాధానాలు ఇవ్వడం లోను జిల్లా రాష్ట్రం లోనే ముందుంది.  స్పందనలో చక్కటి పరిష్కారం లభిస్తుందనే నమ్మకం  అర్జీ దారులకు కలిగి   స్పందనకు వచ్చే వినతుల సంఖ్య కూడా పెరిగింది .

జిల్లాకు అత్యంత ప్రతిష్టాత్మకమైన భోగాపురం ఎయిర్ పోర్ట్ భూ సేకరణ పూర్తి  కావడం లో, కోర్ట్ కేసు లను త్వరగా పరిష్కారం చేసి ఒక కొలిక్కి తేవడం లో  కలెక్టర్ కీలకంగా వ్యవహరించారు.

నిరుపయోగంగా ఉన్న శిల్పరామాన్ని సుందర పర్యాటక కేంద్రంగా  తీర్చి దిద్ది జిల్లా వాసుల అభిమానాన్ని చూరగొన్నారు.

 కలెక్టరేట్ నందు పని చేస్తున్న మహిళ ఉద్యోగుల కోసం ప్రత్యెక  టాయిలెట్ల కోసం   ను ఏర్పాటు చేసి మహిళల అభిమానాన్ని చూరగొన్నారు. మహాకవి స్పూర్తిని నింపేలా  కలెక్టరేట్ ఆవరణ లో గురజాడ విగ్రహాన్ని ప్రతిష్టించారు.

నీతి అయోగ్ నుండి మౌలిక వసతుల కల్పనకు కలెక్టర్ కు ప్రత్యెక అభినందనలు లభించాయి.  పోర్టిఫైడ్ రైస్ వినియోగానికి స్కోచ్ అవార్డు లభించింది.

పది పరీక్షా ఫలితాలు సంతృప్తి నిచ్చాయి: జిల్లా కలెక్టర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ సూర్య కుమారి

పదవ  తరగతి పరీక్షల్లో జిల్లా 77.50 శాతాన్ని సాధించి రాష్త్ర  స్థాయి లో 3 వ స్థానాన్ని సాధించడం నాకు సంతోషాన్ని కలిగించింది.  కే.జి.బి.వి లలో కూడా  83.18 శాతం  సాధించడం సంతృప్తి కలిగించిందని ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ సూర్య కుమారి ఆనందం వ్యక్తం చేసారు.  కే.జి.బి.వి లను బలోపేతం చేయడానికి  జిల్లాలో వినూత్నంగా చేపట్టిన సూపర్ 60 విజయవంతం అయి, రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. మిగిలిన జిల్లాల కంటే మన జిల్లా కే.జి.బి.వి లలో అత్యధిక శాతం ఉత్తీర్ణత  సాధించడం చెప్పుకోదగ్గ విషయమన్నారు.  సూపర్ 60 ఆలోచన ను ఆచరణలో పెట్టిన తొలి ఏడాది లోనే మంచి ఫలితాలు రావడం పట్ల ఆనందంగా ఉందన్నారు.

జిల్లాలోని అందరి ప్రజా ప్రతినిధులు,  అధికారులు, ప్రజల సహకారం తో  విద్య, వైద్యం, వ్యవసాయం, స్కిల్ డెవలప్మెంట్, పరిశ్రమలు,  తదితర రంగాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు జిల్లా కలెక్టర్ ఏ.సూర్య కుమారి.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం జిల్లా

Related posts

ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన

Satyam NEWS

జానపద రంగస్థల కళకు ప్రాణం పోసిన మఠంపల్లి వాసి డాక్టర్ గుంటి పిచ్చయ్య

Satyam NEWS

ఉత్తరప్రదేశ్ లో 80కి 80 సీట్లు గెలిచేందుకు బిజెపి వ్యూహం

Satyam NEWS

Leave a Comment