38.2 C
Hyderabad
May 1, 2024 19: 26 PM
Slider విజయనగరం

వాహనదారులు పారా హుషార్…విజువల్ పోలీసింగ్ తో శాఖ సిబ్బంది

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నేరాలు తగ్గుముఖం పట్టాయని నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది.. అయితే వాహనాలు ప్రమాదాలలో అజాగ్రత్త ,నిర్లక్ష్యం చోటు చేసుకుంటున్నాయని..అలాగే నిబంధనలు గాలికి వదిలేస్తున్నారని..వీటి పట్ల ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు విజువల్ పోలీసింగ్ నిర్వహించాలని సూచించిన మీదట రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు శాఖ దానిపై దృష్టి పెట్టింది. అందులో భాగంగా డీజీపీ ఆదేశాలు.. విజయనగరం జిల్లా పోలీసు బాస్ ఎస్పీ దీపికా సూచనలతో జిల్లా పోలీసు యంత్రాంగం విజువల్ పోలీసింగ్ నిర్వహించింది. అందులో భాగంగా.. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్ ల స్టేషన్ హౌస్ ఆఫీసర్లు…ఒకే కాల వ్యవధిలో రోడ్లపై…కనిపించారు.ఆయా పీఎస్ పరిధిలలో ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించినా..లైసెన్స్ లేకపోయినా ,బండి కాగితాలు ఉండకపోయినా…అక్కడికక్కడే ఫోటో తీయడంతో పాటు వాళ్ళు “క్లాస్ ” లు తీసుకుంటున్నారు… సంబంధిత స్టేషన్ ఎస్ఐలు. ఈ మేరకు జిల్లా ఎస్పీ ఎం.దీపిక ఆదేశాలతో పోలీసు అధికారులు, సిబ్బంది జిల్లా వ్యాప్తంగా విజిబుల్ పోలీసింగ్ నిర్వహించి, ఎం.వి.నిబంధనలు అతిక్రమించిన వాహనదారులకు కౌన్సిలింగ్ నిర్వహించి, ఈ-చలానాలు విధించారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం జిల్లా

Related posts

మన ఊరు-మన పోరు విజయవంతంతో కొల్లాపూర్ కాంగ్రెస్ లో నయా జోష్

Satyam NEWS

అక్రమ కేసుల్లో ఇరుక్కున్న వారిని జనసేన అండ

Satyam NEWS

మార్చి మూడో వారానికి విశాఖ నుంచి పాలన?

Bhavani

Leave a Comment