27.7 C
Hyderabad
May 4, 2024 09: 29 AM
Slider నల్గొండ

మత్స్యకారులకు మేలు చేసే చెరువుల ఆక్రమిస్తే సహించేది లేదు

#fishermen

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ గరిడేపల్లి మండల కేంద్రంలో సోమవారం మత్య పారిశ్రామిక సహకార సంఘం సభ్య సమావేశనికి శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి ముఖ్యా అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా శానంపూడి సైదిరెడ్డి మత్యకారులను ఉద్దేశించి మాట్లాడుతూ గత పాలకులు  మత్స్యకారులను విస్మరించారని, ప్రస్తుతం సీఎం కేసీఆర్ మత్స్యకారులకు అన్ని  విధాల ప్రోత్సాహాలు అందిస్తున్నారని అన్నారు.

సొసైటీలో అందరూ ఐకమత్యంగా ఉండి మత్స్యకారుల అభివృద్ధికి దోహదపడేలా చూడాలని అన్నారు.మత్స్యకారుల భవనానికి గరిడేపల్లి మండల కేంద్రంలో ఎక్కడ నిర్మించుకున్నా తన నిధుల నుండి లక్ష రూపాయల నగదు అందిస్తానని, అంతేకాకుండా ప్రభుత్వం వైపు నుండి కూడా అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు.

చెఱువులను ఆక్రమించి నట్లయితే ఎంతటి వారిపైనైనా అయినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మత్య్సకారులు అందరూ ఐక్యం ఉండాలని ప్రభుత్వం నుండి మంజూరు అయిన పథకాలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

సీఎం కేసీఆర్ మత్య్సకారులు వారి కాళ్ళ మీద వారు నిలబడాలని చెరువులు నింపి చేపల పెంపకం చేసుకొని జీవన ఉపాధి పొందే విధంగా ఉండాలని చేస్తున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి, ఎంపీపీ పెండం సుజాత శ్రీనివాస్, సర్పంచ్ త్రిపురo సీతారాం రెడ్డి,నేరేడుచర్ల మున్సిపాలిటీ వైస్ చైర్మన్(పట్టణ అధ్యక్షురాలు) చల్లా శ్రీలత రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

బస్తీ దవాఖాన ను ప్రారంభించిన ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

Satyam NEWS

యోగి వేమన యూనివర్సిటీ అదనపు పరీక్షల నిర్వహణాధికారి

Satyam NEWS

రాత్రి పూట అడ్డంగా దొరికిన మందు బాబు లు…!

Satyam NEWS

Leave a Comment