27.7 C
Hyderabad
May 11, 2024 10: 23 AM
Slider ప్రత్యేకం

ఈ దేశానికి ఏమైంది? ఆందోళనకర పరిస్థితుల్లో ఐదుగురు సీఎంలు

#5states

దేశంలో కరోనా సెకండ్ వేవ్ అతి దారుణంగా ఉంది. రోజు రోజుకూ కరోనా కేసులు పెరిగిపోతున్న విషయం తెలిసిందే. ఎంతో మంది కరోనా బారిన పడి ఆసుపత్రుల పాలు అవుతున్నారు. ఈ జాబితాలో ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా చేరడం ఆశ్చర్యం కలిగిస్తున్నది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారిన పడ్డారు. ఆయనకు కొద్ది పాటి జ్వర లక్షణాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో ప్రచారం చేసిన వచ్చిన తర్వాత కరోనా కు గురయ్యారు. ఉప ఎన్నికల్లో టీఆర్ ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసిన నోముల భరత్ కు కూడా కరోనా వచ్చింది.

అదే విధంగా ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాధ్ కూడా కరోనా బారిన పడ్డారు. ఆయన కుంభమేళాకు వెళ్లి వచ్చిన తర్వాత కరోనాకు గురయ్యారు. కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కూడా కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది.

కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ భార్యకు కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తన భార్యతో కలిసి ఆయన ఆసుపత్రికి వెళ్లారు. తనతో బాటు తన మనవడిని కూడా తీసుకువెళ్లారు. ఇలా కరోనా రోగితో కలిసి వెళ్లడంతో ఆయన కూడా కరోనాకు గురయ్యేపరిస్థితి ఉందని ముఖ్యమంత్రి వైద్యులు సైతం ఆందోళన వ్యక్తం చేశారు.

తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి కూడా ఆసుపత్రి పాలయ్యారు. ఆయనకు హెర్నియా ఆపరేషన్ జరుగుతున్నది. ఒకే సారి ఐదుగురు ముఖ్యమంత్రులు ఆందోళనకర పరిస్థితుల్లో చిక్కుకుని ఉన్నారు.

మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రేణుకా చౌదరికి కరోనా పాజిటివ్ వచ్చింది. జలుబు , దగ్గు , జ్వరంతో ఆమె బాధపడుతున్నారు.

Related posts

9న ఇంద్రవెల్లి సభను విజయవంతం చేయాలి

Satyam NEWS

శివనామస్మరణతో మారుమోగిన పాదగయ క్షేత్రం

Satyam NEWS

క్రమబద్ధీకరణ పేరుతో వీలీనం

Murali Krishna

Leave a Comment