26.7 C
Hyderabad
April 27, 2024 08: 01 AM
Slider గుంటూరు

టీడీపీ అనాలోచిత విధానాల వల్లే ఇబ్బంది పడ్డ ఇమామ్ లు

#ysrcongress

మైనార్టీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద పీట వేస్తుందని గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే డా. గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఇమామ్ లు, మాజాదులకు గౌరవ వేతనాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెంచినందున ఎమ్మెల్యే కి మైనార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. పట్టణంలోని ప్రకాశ్ నగర్ పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ అసెంబ్లీలో నలుగురు ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు, మండలి వైస్ చైర్మన్ పదవిని కూడా మైనార్టీలకు ముఖ్యమంత్రి జగన్ కేటాయించారని తెలిపారు.

నరసరావుపేట పట్టణంలోని వక్ఫ్ బోర్డు కిందకి వచ్చే ఐదు మసీదులు, అంజుమన్ కాంప్లెక్స్ పడవేసిన తర్వాత గత రెండున్నరేళ్ల నుంచి ఇక్కడ పనిచేస్తున్న ఇమామ్లు, మౌజోమ్లు ఇబ్బంది పడుతున్నారని వివరించారు. ఈ ఐదు మసీదులు మీద వచ్చే ఆదాయం వచ్చే ఆదాయం నుంచే కరెంట్ బిల్లులుతో పాటు ఇతర అవసరాల కోసం  ఖర్చు చేయాల్సి ఉందని చెప్పారు. ఎన్నికల ముందు రాజకీయాల కోసం టీడీపీ వాళ్లు అంజుమన్ కాంప్లెక్స్ ను పడగొట్టారని విమర్శించారు. కోర్టు కేసుల అనంతరం ఇటీవలే ముందు మసీదును తర్వాత షాంపింగ్ కాంప్లెక్సు కు శంకుస్థాపన చేశామని, రానున్న ఏడాదిన్నరలో ఈ రెండింటిని పూర్తి చేస్తాం. వర్షాల కారణంగా పనులు వాయిదా పడినట్లు వివరించారు.

నిన్న అసెంబ్లీలో మంత్రి అంజద్ బాషా ని కలిసి మసీదు, కాంప్లెక్స్  గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగిందన్నారు. అమలాపురానికి కేటాయించిన రూ.80లక్షలు కూడా నరసరావుపేటకు కేటాయించాలని కోరడం జరిగిందన్నారు. ప్రిన్సిపల్ సెక్రటరీ కి కూడా లేఖ రాయడం జరిగిందన్నారు. ఇవి రెండు త్వరితగతిన పూర్తైతే టెండర్లకు వెళ్లి కాంపెక్స్ నిర్మాణం త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నాని వివరించారు.  ఆటోనగర్ నిర్మాణం కూడా త్వరతగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు షేక్ కార్పొరేషన్ చైర్మన్ షేక్ ఆశ బేగం ఖాజావలె, షేక్ ఖాదర్ బాషా, షేక్ సుభాని, వలి, ఖాజా, సయ్యద్ ఖాదర్ బాషా, జీకే కరిముల్లా, రాష్ట్ర కార్యదర్శి మిట్టపల్లి రమేశ్, కరిముల్లా, నాగుర్ మీరా, వరకవట్ట బాబు అన్ని మసీదులు ఇమామ్లు, మౌజోమ్లు పాల్గొన్నారు.

Related posts

ఎయిర్ పోర్టు జోన్ సీఐ గా ప్రసాదరావు

Bhavani

ఓ విఘ్నరాజా…

Satyam NEWS

శీతాకాలం వ్యాధులకు సంజీవిని హోమియోపతి వైద్యం

Bhavani

Leave a Comment