36.2 C
Hyderabad
April 27, 2024 21: 44 PM
Slider కృష్ణ

రాష్ట్ర ప్రభుత్వం కాజేసిన పంచాయితీ నిధులు తిరిగి ఇవ్వాలి

#yvb rajendra prasad

రాష్ట్ర ప్రభుత్వం కాజేసిన గ్రామ పంచాయతీల నిధులు వెంటనే తిరిగి పంచాయతీల  ఖాతాల్లో జమ చేయాలని ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షుడు బాబు రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 12918 గ్రామ పంచాయతీలకు చెందిన రూ.11660 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కాజేసిందని ఆయన అన్నారు.

తిరిగి పంచాయితీలకు ఆ నిధులు ఇవ్వకపోతే గ్రామ స్థాయి నుండి మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి వరకు రాజకీయాలకతీతంగా రాష్ట్రంలోని సర్పంచులు అందరూ కలిసి ఉద్యమాలు, పోరాటాలు చేసి హక్కులు సాధించుకుంటారని ఆయన అన్నారు.

నేడు విజయవాడలోని లెనిన్ సెంటర్ దగ్గర ఎన్టీఆర్ విజయవాడ జిల్లా, కృష్ణా జిల్లా సర్పంచులు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ ఆధ్వర్యంలో భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తన నిరంకుశ వైఖరితో రాష్ట్రంలోని సర్పంచులందర్నీ ఇబ్బందులకు గురి చేస్తూ, ఉత్సవ విగ్రహాల్లాగా మారుస్తుందని అన్నారు.

దీనిలో భాగంగానే గతంలో కేంద్ర ప్రభుత్వం 14,15 వ ఆర్థిక సంఘాల ద్వారా గ్రామ పంచాయతీలకు పంపించిన రూ. 7660 కోట్లను దారి మళ్లించి తన సొంత అవసరాలకు వాడుకుందని ఆయన అన్నారు. దానిపై పంచాయతీ రాజ్ ఛాంబర్ తరఫున ఆందోళనలు చేసి లెక్కలు అడిగితే వాటి లెక్కలు చూపకపోగా, రాష్ట్రంలోని 12918 గ్రామాల్లో మా సర్పంచులు ఇళ్లిళ్లు తిరిగి వసూలు చేసిన ఇంటి పన్నులు, నీటి పన్నులు, ఇతర జనరల్ ఫండ్స్  రూ. 4000 వేల కోట్లను పంచాయతీల ఖాతాల్లో వేస్తే ఏప్రిల్ ఒకటో తారీఖున సర్పంచులకు చెప్పకుండా అవికూడా కాజేశారని అన్నారు.

సర్పంచ్ ల సంతకం లేకుండా రాత్రికి రాత్రే రాష్ట్రప్రభుత్వం దొంగలించిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఛాంబర్ నాయకులు ముల్లంగి రామకృష్ణారెడ్డి, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ విజయవాడ జిల్లా సర్పంచులు మూడే శివ శంకర్ యాదవ్, ఎనిగళ్ల  కుటుంబరావు, ఎం.రవి ప్రసాద్, వసంతరావు, ప్రసాదరావు, పంపు గడవల ఫ్రాన్సిస్,  రత్నం దిలీప్ కుమార్, కందిమల్ల అంజనీ కుమారి,  రాధాకృష్ణ,  శ్రీనివాసరావు, వెంకటేశ్వర రావు మరియు తదితర సర్పంచ్లు పాల్గొన్నారు.

Related posts

పాఠ్య పుస్తకాల పంపిణీ కి సరైన సమయం కాదు

Satyam NEWS

బతుకమ్మ చీరలు పంపిణీకి రంగం సిద్ధం

Satyam NEWS

పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి

Satyam NEWS

Leave a Comment