28.7 C
Hyderabad
May 5, 2024 10: 05 AM
Slider హైదరాబాద్

ఉప్పల్ లో బస్తీ దవాఖానలను ప్రారంభించిన వైద్య మంత్రి

#Eetala Rajendar

సీఎం కేసీఆర్ పేద ప్రజలకు ఉచిత చికిత్సలు  అందుబాటులో ఉండాలనే సంకల్పం తో  బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశారని ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఇక్కడ  సామాన్య ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని ఆయన వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం   ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  బస్తీ దవాఖాన లను మల్లాపూర్  డివిజన్ పరిధిలోని  అశోక్ నగర్ ,ఎస్ వి నగర్ , సింగం చెరువు తండాలలో ఆయన నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న వర్షాకాలం లో   సీజనల్ వ్యాధులు రాకుండా,  కరోనా వైరస్ కట్టడికి ఇలాంటి బస్తి దావఖానాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి మేయర్ బొంతు రామ్మోహన్ , ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ లు  పన్నాల దేవేందర్ రెడ్డి , గో ల్లూరు అంజయ్య పాల్గొన్నారు.

ఇంకా తాసిల్దార్ గౌతమ్ కుమార్, జి హెచ్ ఎం సి డిప్యూటీ కమిషనర్ శైలజ, మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ సంపత్, డాక్టర్ స్వప్న, డాక్టర్ మాధురి, డాక్టర్ వెంకటేశ్వర్లు, డాక్టర్ గీత, జిహెచ్ఎంసి ఈఈ కోటేశ్వరరావు, సంతోష్ రెడ్డి తదితరులు కూడా పాల్గొన్నారు.

Related posts

రాష్ట్ర వ్యాప్తంగా మాలలను చైతన్యం చేయాలి

Satyam NEWS

అప్పుడు కన్ను గీటి ఇప్పుడు స్మిమ్మింగ్ పూల్ లో మునిగి

Satyam NEWS

ఉద్యోగమేమో ఫుల్ టైం జీతం మాత్రం పార్ట్ టైం

Satyam NEWS

Leave a Comment