31.2 C
Hyderabad
May 3, 2024 00: 31 AM
Slider సినిమా

డా. మోహ‌న్‌బాబు `స‌న్నాఫ్ ఇండియా` ఫ‌స్ట్‌లుక్ విడుద‌ల‌

#SonOfIndia

భారతీయ సినిమా బహుముఖ నటులలో ఒకరైన డాక్టర్ మోహన్ బాబు చిత్రనిర్మాణంలో ప్రతి విభాగం గురించి లోతైన జ్ఞానం కలిగి ఉన్నారు. తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ `సన్నాఫ్ఇండియా`కు స్క్రీన్ ప్లే అందించడంతో పాటు ఈ సినిమాలో ఇంతకు ముందెన్నడూ చూడని శక్తివంతమైన పాత్రను పోషిస్తున్నారు.

ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ రోజు విడుద‌ల‌చేశారు మేక‌ర్స్‌. ఈ పోస్ట‌ర్లో  డాక్టర్ మోహన్ బాబు మెడ‌లో రుద్రాక్ష మాల ధరించి ఇంటెన్స్ లుక్‌లో క‌నిపిస్తున్నారు.

మోహన్ బాబు కొత్త హెయిర్‌డోతో పూర్తిగా భిన్నమైన గెటప్‌లో క‌నిపిస్తున్నారు. ఈ పాత్ర కోసం గడ్డం కూడా పెంచుకున్నారు ఇన్ని దశాబ్దాల సినీ కెరీర్‌లో మోహన్ బాబుకి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ లుక్ అని చెప్పొచ్చు. ఈ  ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ చిత్రంపై అంచ‌నాలను మరో లెవ‌ల్‌కి పెంచింది.

టాలీవుడ్‌లో ఇంత‌వ‌ర‌కూ రాని ఒక విభిన్న క‌థా క‌థ‌నాల‌తో రూపొందుతోన్న ఈ చిత్రానికి  డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు.  శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్,  24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

విష్ణు మంచు భార్య, మోహన్ బాబు కోడ‌లు విరానికా మంచు ఈ చిత్రంతో స్టైలిస్ట్‌గా మారారు. ఆమె మోహన్ బాబును పూర్తిగా కొత్త అవతారంలో చూపించారు.

ఈ చిత్రానికి మాస్ట్రో ఇళ‌యరాజా సంగీతం అందింస్తుండ‌గా సర్వేష్ మురారి ఛాయాగ్రాహకుడు. ఈ చిత్రానికి మాట‌లు డైమండ్ ర‌త్న‌బాబు, తోట‌ప‌ల్లి సాయినాథ్‌. సుద్దాల అశోక్‌తేజ లిరిక్స్ అందిస్తున్నారు. గౌతంరాజు ఎడిట‌ర్‌గా వ‌ర్క్ చేస్తుండ‌గా చిన్నా ఆర్ట్ డైరెక్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

డా. మోహ‌న్‌బాబు న‌టిస్తోన్న ఈ చిత్రానికి క‌థ‌, ద‌ర్శ‌క‌త్వం: డైమండ్ ర‌త్న‌బాబు, స్క్రీన్ ప్లే: డా.మోహ‌న్‌బాబు, నిర్మాత‌: విష్ణుమంచు, బ్యాన‌ర్స్‌: శ్రీ లక్ష్మి ప్రసన్న పిక్చర్స్,  24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, సంగీతం: మాస్ట్రో ఇళ‌యరాజా, సినిమాటోగ్ర‌ఫి: సర్వేష్ మురారి, మాట‌లు: డైమండ్ ర‌త్న‌బాబు, తోట‌ప‌ల్లి సాయినాథ్‌, స్టైలిస్ట్‌(మోహ‌న్‌బాబు): విరానిక మంచు, లిరిక్స్‌: సుద్దాల అశోక్ తేజ‌, ఆర్ట్‌: చిన్నా, ఎడిట‌ర్‌: గౌతంరాజు, పిఆర్ఒ: వ‌ంశి – శేఖ‌ర్‌.

Related posts

ఎయిర్ క్రాఫ్ట్ ఇంజనీర్ల సంఘానికి విజయ్ నాయక్ ఎన్నిక

Satyam NEWS

తెలంగాణ సూఫీ తాత్వికతకు ప్రతిష్టాత్మక అవార్డు

Satyam NEWS

రాష్ట్రపతికి లేఖ: మానసిక స్థితి సరిగా లేని వ్యక్తిలా ప్రవర్తిస్తున్న జగన్

Satyam NEWS

Leave a Comment