34.7 C
Hyderabad
May 5, 2024 00: 31 AM
Slider సినిమా

సినీ కార్మికులకు నిత్యావసరాలు అందించిన మనో

#SingarMano

కరోనా అందరి జీవితాలను అతలాకుతలం చేసేస్తోంది. అన్ని రంగాలు కోవిడ్ దెబ్బకు కుదేలైపోయాయి. ఇదే సమయంలో సినీ కార్మికుల కష్టాల గురించి ప్రత్యేకంగా చెప్కక్కర్లేదు.

షూటింగ్‌లు ఉంటేనే వీరికి నాలుగు వేళ్లు లోపలికి వెళ్లేది. అలాంటిది నాలుగు నెలల నుంచి ఉపాధి లేకపోవడంతో వేలాదిమంది సినీ కార్మికులు ఆకలితో అలమటిస్తున్నారు. వీరిని ఆదుకోవడానికి ఇప్పటికే హీరోలు, దర్శక నిర్మాతలు తమ వంతు విరాళాలు అందించారు.

ఈ క్రమంలో ప్రముఖ సినీ నేపథ్య గాయకుడు ‘ మనో ‘ పెద్ద మనుసు చాటుకున్నారు. సినీ కార్మికుల కష్టాల చూసి చలించిపోయిన ఆయన శనివారం హైదరాబాద్ కృష్ణానగర్‌లో బియ్యం, పప్పు దినుసులు వంటి నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు సినీ పెద్దలు పాల్గొన్నారు.

Related posts

మంత్రివర్గంలోకి అనంత, జంగా దాదాపుగా ఖరారు

Satyam NEWS

చేనేత కార్మికుల్ని అణచివేస్తున్న కేంద్ర ప్రభుత్వం

Satyam NEWS

దేశ ఐక్యతపై ప్రతిజ్ఞ

Murali Krishna

Leave a Comment