31.7 C
Hyderabad
May 6, 2024 23: 40 PM
Slider ముఖ్యంశాలు

కామారెడ్డికి ఎన్ని నిధులైన ఇస్తాం: మంత్రి కేటీఆర్

#ktr

కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ఎన్ని నిధులైన ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. నేడు కామారెడ్డి మున్సిపాలిటీకి సంబంధించి సుమారు 28 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. కామారెడ్డికి వచ్చిన మంత్రి కేటీఆర్ కు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎంపీ బిబిపాటిల్ ఘనస్వాగతం పలికారు.

క్రేన్ సహాయంతో మంత్రి కేటీఆర్, విప్ గంప గోవర్ధన్ లకు గజమాలతో సత్కరించారు. బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన స్వాగత తోరణం, ఆరులైన్ల రోడ్డు, సెంట్రల్ లైటింగ్, డివైడర్ల నిర్మాణాలకు సంబంధించిన పైలాన్ లను కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ సారథ్యంలో కామారెడ్డి అభివృద్ధి శరవేగంగా సాగుతుందన్నారు. 28 కోట్లతో చేపట్టిన పనులను ప్రారంభించుకోవడం శుభసూచకమన్నారు. కామారెడ్డి పట్టణ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా 25 కోట్లు మంజూరు చేసారని, విప్ కోరిక మేరకు స్టేడియం పునరుద్ధరణ, స్పోర్ట్స్ కాంప్లెక్స్, అంతర్గత రోడ్లకు మరొక 20 కోట్లు మంజూరు చేస్తున్నట్టు కేటీఆర్ ప్రకటించారు. కామారెడ్డి అభివృద్ధికి ఎన్ని నిధులైన ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

కేటీఆర్ కు నిరసన సెగలు

రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కు కామారెడ్డి పర్యటనలో ఊహించని పరిణామం ఎదురైంది. కాంగ్రెస్ నాయకుల నుంచి ఆయనకు నిరసన సెగ తగిలింది. కామారెడ్డిలో కార్యక్రమాలు ముగించుకుని ఎల్లారెడ్డి వెళ్తున్న మంత్రి కాన్వాయిని దేవునిపల్లి దేవివిహార్ సమీపంలో కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నాయి. ఊహించని పరిణామంతో పోలీసులు షాక్ అయ్యారు. ఉదయం నుంచి పోలీసులు కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసిన, అడుగడుగునా భారీ బందోబస్తు ఏర్పాటు చేసినా పోలీసుల కళ్లుగప్పి కేటీఆర్ కాన్వాయిని అడ్డుకోవడం కలకలం రేపింది. అప్రమత్తమైన పోలీసులు కాంగ్రెస్ నాయకులను అడ్డుకున్నారు. అయినా కేటీఆర్ కాన్వాయిని కదలనివ్వకుండా అడ్డుకోవడంతో కాంగ్రెస్ శ్రేణులు సక్సెస్ అయ్యారు. దాంతో 10 నిమిషాల పాటు కేటీఆర్ కాన్వాయి నిలిచిపోయింది. ఎల్లారెడ్డి పట్టణంలో సైతం యూత్ కాంగ్రెస్ నాయకులు మంత్రి కేటీఆర్ కాన్వాయిని అడ్డుకోగా పోలీసులు వారిని చెదరగొట్టారు. కాంగ్రెస్ నాయకులను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.

తాడ్వాయిలో ఆందోళన చేస్తున్న గ్రామస్తులు

తాడ్వాయిలో ఆందోళన

తాడ్వాయి మండల కేంద్రంలో ఎండ్రియల్ గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. తమ గ్రామానికి రోడ్డు కోసం జనవరి నెలలో నిధులు మంజూరైన ఇప్పటికి పనులు చేపట్టడం లేదని ఆందోళన చేపట్టారు. వెంటనే పనులు చేయాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ దృష్టికి రోడ్డు విషయాన్ని తేవడానికి తాము ఆందోళనకు దిగినట్టి పేర్కొన్నారు.

కాన్వాయిని అడ్డుకున్న కాంగ్రెస్ నాయకుల అరెస్ట్

అర్ధరాత్రి నుంచే అరెస్టులు

కామారెడ్డిలో మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులకు తెరలేపారు. అర్ధరాత్రి నుంచే కాంగ్రెస్, బీజేపీ, విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు.

కేటీఆర్ కు అస్వస్థత

మంత్రి కేటీఆర్ అస్వస్థతకు గురయ్యారు. కామారెడ్డిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొనడానికి కామరెడ్డికి వచ్చిన నేపథ్యంలో స్వల్పంగా అస్వస్థతకు గురి కావడంతో హైదరాబాద్ నుంచి నేరుగా బైపాస్ వద్ద స్వాగత తోరణం ప్రారంభించాల్సి ఉండగా నేరుగా సిరిసిల్ల రోడ్డు నుంచి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు చేరుకున్నారు. గెస్ట్ హౌస్ లో ఉన్న కేటీఆర్ కు వైద్యుల బృందం చికిత్స అందించినట్టుగా సమాచారం. కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు.

Related posts

జగన్ రెడ్డికి రఘురాముడిని బహిష్కరించే దమ్ముందా?

Satyam NEWS

బసవతారం క్యాన్సర్ హాస్పిటల్ సీఈవోగా డాక్టర్ కృష్ణయ్య

Satyam NEWS

అన్న వద్దన్నా తెలంగాణకు వచ్చిన చెల్లి

Satyam NEWS

Leave a Comment