37.2 C
Hyderabad
May 2, 2024 14: 53 PM
Slider విశాఖపట్నం

ఇండియా విజన్ డాక్యుమెంట్ విడుదల చేయనున్న చంద్రబాబు

#chandrababu

5 strategies for India as global leader పేరుతో విజన్ డాక్యుమెంట్ ను తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్. చంద్రబాబు నాయుడు విడుదల చేయనున్నారు. విశాఖపట్నంలో ఆగస్టు 15న ఈ కార్యక్రమం జరుగుతుంది. విజన్ డాక్యుమెంట్ రూపకల్పన పై గత కొద్ది నెలలుగా గ్లోబల్ ఫోరమ్ ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే సంస్థ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్‌ పని చేస్తున్నది. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయిన్బుల్ ట్రాన్స్ఫర్మేషన్ చైర్మన్ గా నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. మేధావులు, విద్యార్థులు, ప్రొఫెసర్లు, ఉన్నత విద్యావంతులు, పలు రంగాల నిపుణుల సమక్షం లో వైజాగ్ లో విజన్ డాక్యుమెంట్ ను ఆయన విడుదల చేయనున్నారు.

గ్లోబల్ ఫోరమ్ ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ అనే సంస్థ నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్‌గా పనిచేస్తోంది. మూడేళ్ల క్రితం ఈ సంస్థ ఏర్పాటైంది. ఈ సంస్థకు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చైర్మన్‌గా ఉన్నారు. దీనిలో ఆర్థిక రంగ నిపుణులు, పర్యావరణ వేత్తలు, రిటైర్డ్ ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో పని చేసిన అధికారులు, కార్పొరేట్ ప్రముఖులు, విద్య, వైద్య, న్యాయ, మీడియా రంగ నిపుణులు, కార్పొరేట్ రంగ వ్యక్తులు ఉన్నారు. పాలసీల రూపకల్పన, రీసెర్చ్, నాలెడ్జ్ షేరింగ్ అనే అంశాలకు జిఎఫ్ఎస్టి వేదికగా పనిచేస్తోంది.

మౌలిక సదుపాయాలు, నిర్మాణ రంగం, లాజిస్టిక్స్, తయారీ పరిశ్రమల, MSME పరిశ్రమలు, టెక్నాలజీ, ఎనర్జీ, స్టార్ట్-అప్ ఎకోసిస్టమ్, వాతావరణ మార్పులు, ప్రజా ఆరోగ్యం వంటి అంశాలపై జిఎఫ్ఎస్‌టి పని చేస్తుంది. భారతదేశం స్వాతంత్ర్యం సాధించి 100 ఏళ్లు పూర్తి చేసుకునే 2047 నాటికి ప్రపంచ నెంబర్ 1 ఆర్థిక వ్యవస్థగా రూపొందే అవకాశం ఉంది. దీనిలో భాగంగా స్ట్రాటజీస్ ఫర్ ఇండియా@100 అనే కాన్సెప్ట్‌పై జిఎఫ్ఎస్టి పనిచేస్తుంది. ఆయా రంగాల నిపుణులు, విద్యావేత్తలు, సంస్థలు, వ్యక్తుల భాగస్వామ్యంతో GFST నివేదికలు సిద్దం చేస్తుంది. అందులో భాగంగా ఆగస్ట్ 15  వ తేదీన విజన్ డాక్యుమెంట్ ను చంద్రబాబు నాయుడు విడుదల చేయనున్నారు.

Related posts

భూ సమస్యలు పరిష్కారం కాక రైతులకు ఇబ్బంది

Satyam NEWS

అర్నబ్ గోస్వామిపై రూ.200 కోట్ల పరువునష్టం

Satyam NEWS

వైరల్ వీడియోను ఫాలో అవుతున్న కర్నూలు పోలీసు

Satyam NEWS

Leave a Comment