29.7 C
Hyderabad
May 4, 2024 04: 59 AM
Slider గుంటూరు

వరల్డ్ మస్కిటో డే: దోమలను తరిమి కొట్టకపోతే అంటువ్యాధులు

#mosqutioday

గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం వి.రెడ్డి పాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో  శుక్రవారం వరల్డ్ మస్కిటో డే నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా  ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో దోమల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన సమావేశములు జరిగాయి.  ఈ సమావేశములలో పాల్గొన్న ఆయా ప్రాథమిక కేంద్రాల వైద్యాధికారులు డాక్టర్ స్వాతి డాక్టర్ గీతాంజలి మాట్లాడుతూ దోమలు కుట్టడం వల్ల మలేరియా డెంగ్యూ వంటి వ్యాధులు వస్తాయని అన్నారు. దోమల నివారణకు దోమతెరలు వాడాలని అన్నారు. పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని  అన్నారు. ప్రతి శుక్రవారం డ్రై డే పాటించాలని అన్నారు. అనంతరం ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో గల గ్రామాల్లో వరల్డ్ మస్కిటో డే ర్యాలీ కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జి. శివ ప్రకాష్ ఎంపిహెచ్ ఇఓ సుబ్బారెడ్డి  హెల్త్ సూపర్వైజర్లు రాము కిరణ్ కుమార్  సురేష్ ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

కోర్టు ప్రొసీడింగ్స్ ప్రత్యక్ష ప్రసారానికి చర్యలు తీసుకోవాలని పిల్

Satyam NEWS

యాంటీ కరోనా: అరసవల్లిలో మహా సౌర, అరుణ హోమం

Satyam NEWS

పేదలకు బియ్యం పంపిణీ చేస్తున్నఅమ్మ ఫౌండేషన్

Satyam NEWS

Leave a Comment