41.2 C
Hyderabad
May 4, 2024 17: 17 PM
Slider ఖమ్మం

టీఆర్ఎస్ అప్రజాస్వామిక వ్యవహారశైలి

#Ponguleti

దుబ్బాక ఉప ఎన్నికల సమయంలో పోలీసులు వ్యవహరిస్తోన్న అప్రజాస్వామికం గా ఉందని బిజెపి కోర్ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి విమర్శించారు.

భయోత్పాతం సృష్టించి ఎన్నికల్లో లబ్ది పొందాలని టిఆర్ఎస్ ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఎంపీ బండి సంజయ్  అరెస్ట్ కి నిరసనగా ఆయన హైదరాబాద్ లోని తన నివాసం వద్ద దీక్ష చేపట్టారు.

కరోన బారిన పడి పూర్తిగా కోలుకోని వైద్యుల పర్యవేక్షణలో సుధాకర్ రెడ్డి   పోస్ట్ కరోన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. కరీంనగర్ వెళ్లాలని నిర్ణయించుకున్న  వైద్యులు అందుకు అనుమతించలేదు.

దీంతో ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో పరిస్థితుల్లో బండి సంజయ్ కు సంఘీభావంగా ఇంటివద్ద దీక్ష చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రభుత్వ తీరును తప్పు పట్టారు.

స్వేచ్ఛ గా, ప్రశాంతంగా ఎన్నిక జరిగేలా చూడాలని ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేసారు. కేంద్ర బలగాలను మోహరించి ఎన్నిక ప్రశాంతంగా జరగాలని ప్రభూత్వానికి సూచించారు.

పోలీసులు ఏకపక్షంగా వ్యవహారించడాన్ని ఆయన తప్పు పట్టారు.

Related posts

సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

Satyam NEWS

రికార్డు స్థాయిలో మోపిదేవి స్వామి హుండీ ఆదాయం

Satyam NEWS

ఉపాధి నిధులను వెనక్కి పంపమనడం సిగ్గుచేటు

Bhavani

Leave a Comment