38.2 C
Hyderabad
April 27, 2024 16: 59 PM
Slider ఆధ్యాత్మికం

రికార్డు స్థాయిలో మోపిదేవి స్వామి హుండీ ఆదాయం

mopidevi temple

కృష్ణాజిల్లా, మోపిదేవి  శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో వచ్చింది. కార్తీక మాసం,  షష్ఠి కలిసి రావడంతో  రికార్డు స్థాయిలో కార్తీకేయుని హుండి ఆదాయం వచ్చినట్లు అంచనా వేస్తున్నారు. మోపిదేవి శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో నేడు హుండీ లెక్కింపు జరిగింది.

ఆలయ అధికారులు గ్రామస్తులు సమక్షంలో హుండీలను తెరిచి లెక్కింపు నిర్వహించారు.  స్వామి వారి ఆదాయం 73 రోజులు గాను 53 లక్షల 37 వేల 020 రూపాయలు, బంగారం 0-32 గ్రాముల 400 మిల్లీ గ్రాములు, వెండి – 2 కేజిల 850 గ్రాములు , నిత్యాన్నదాన పధకానికి 99 వేల 336 రూపాయలు, 291 USA డాలర్లు స్వామి వారి కి వచ్చాయి.  

ఈ కార్యక్రమంలో ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వాహణాధికారి G.V.D.N లీలా కుమార్, బందరు డివిజన్ దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ సుధాకర్ బాబు, సూపరింటెండెంట్ మధుసూదన రావు,  ఆలయ సిబ్బంది  భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Related posts

కరోనా సోకి ఉత్తర ప్రదేశ్ మంత్రి మృతి

Satyam NEWS

మెరుపు వేగంతో కదిలిన పోలీసులు: బాలుడు సేఫ్

Satyam NEWS

బడ్జెట్ సెషన్ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్?

Satyam NEWS

Leave a Comment